Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు..!

Published : Apr 04, 2025, 01:15 PM IST

న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు  కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఆ లక్షణాలే వారిని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు తొందరగా ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు.మరి.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో కూడా తెలుసుకుందాం..

PREV
15
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు..!

ఈ భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరూ  ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటారు. సందర్భాన్ని బట్టి..వారి వ్యక్తిత్వం, వారిలోని ప్రత్యేకతలు బయటపడుతూ ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కూడా.. మనం పుట్టిన తేదీ ని బట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు.  కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఇతరుల కింద పని చేయడానికి ఇష్టపడరు. వాళ్లకు వాళ్లు తోపుల్లా ఫీలౌతారు. తామే నలుగురికి పని ఇచ్చేవాళ్లం అని, తాము ఇంకొకరి దగ్గర పని చేయడం ఏంటి అని ఫీలౌతారు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

25

ఏ నెలలో అయినా 1, 10,19, 28 తేదీల్లో జన్మించిన వారిని సూర్యుడు పాలిస్తూ ఉంటాడు. అందుకే, ఈ వ్యక్తులు అపరిమితమైన శక్తి ని కలిగి ఉంటారు. వీరు అన్నింట్లోనూ విజయం సాధించగల సత్తా వీరిలో ఉంటుంది. వీరు తొందరగా ఎవరి కిందా పని చేయడానికి ఇష్టపడరు.మరి.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో కూడా తెలుసుకుందాం..
 

35


స్వతంత్రంగా ఉంటారు..
 ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారంతా న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 కిందకు వస్తారు.వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు ఎవరి మీదా ఆధారపడటానికి ఇష్టపడరు. ఇతరుల కింద పని చేయడం కంటే, వారే సొంతంగా అభివృద్ధి చెందగలం అని వీరు భావిస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మంచి లీడర్ అవుతారు. వారు తమతో పాటు.. తమ చుట్టూ ఉన్నవారిని కూడా ముందుకు నడిపిస్తారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. కష్ట సమయాల్లో కూడా కొంచెం కూడా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళతారు.
 

45

గుర్తింపు..
ఈ నెంబర్ 1  వ్యక్తులంతా తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని తపనపడతారు.  నిజాయితీగా ఉంటారు. అంకిత భావంతో పని చేస్తారు. వారిలో సృజనాత్మకత కూడా చాలా ఎక్కువ.వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు.ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకుంటారు. ఆ తర్వాత  ఆ సమస్యలనే తమకు అనుకూలంగా మార్చుకుంటారు.

55

అదృష్ట రంగులు..
ఈ తేదీల్లో పుట్టిన వారికీ ఎరుపు, నారింజ, పసుపు, గోల్డెన్ షేడ్స్ శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రంగులు ఈ తేదీల్లో పుట్టిన వారికీ విశ్వాసం, శక్తిని అందిస్తాయి. వారి లక్ష్యాలను చేరుకోవడానికి కూడా సహాయపడుతుంది. వీరి అదృష్ట రత్నం రూబీ. ఈ రాయి కనుక వీరు ధరిస్తే వారి అదృష్టం మరింత పెరుగుతుంది. విజయం సాధించడానికి హెల్ప్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories