Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి బ్రేకప్ లు ఎక్కువ.. కారణం ఏంటో తెలుసా?

Published : Jan 19, 2026, 11:00 AM IST

ప్రేమ అందరి జీవితాల్లో ఒకే రకంగా ఉండదు. కొందరు ప్రేమలో పదే పదే ఓడిపోతూ ఉంటారు. వాళ్లు నిజంగా ప్రేమించినా, ఎంత త్యాగం చేసినా వారికి బ్రేకప్ తప్పదు. జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారి జీవితంలో బ్రేకప్ లు ఎక్కువగా ఉంటాయో చూద్దాం.

PREV
15
Birth Date Astrology

ఇటీవలి కాలంలో ప్రేమ సంబంధాల్లో నిలకడ లేకపోవడం, తరచూ బ్రేకప్‌లు కావడం చాలా మంది జీవితాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇది కేవలం పరిస్థితుల వల్ల మాత్రమే కాదు, పుట్టిన తేదీ ప్రభావం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా 7, 9, 14, 16 తేదీల్లో పుట్టినవారికి బ్రేకప్‌లు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. 

25
కేతువు ప్రభావంతో..

ముఖ్యంగా ఏ నెలలో అయినా 7వ తేదీన పుట్టినవారిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. అంతర్ముఖులు, భావోద్వేగపరంగా చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ప్రేమలో ఎదుటి వ్యక్తితో మానసికంగా పూర్తిగా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అదే సమయంలో తమ భావాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోవడం వీరికున్న పెద్ద సమస్య. ఈ మౌనం, అర్థం చేసుకోలేని స్వభావం వల్ల భాగస్వామికి దూరం పెరిగి విడిపోవడానికి దారి తీస్తుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

35
మంగళ గ్రహ ప్రభావం ఎక్కువ..

9వ తేదీన పుట్టినవారిపై మంగళ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమలో చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. మొదట్లో సంబంధం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. కానీ అదే తీవ్రత కొంత కాలానికి సమస్యగా మారుతుంది. కోపం, తొందరపాటు నిర్ణయాలు, మాటల్లో కఠినత్వం వీరి రిలేషన్‌షిప్‌ను దెబ్బతీస్తాయి. అయితే ప్రతి బ్రేకప్ వీరిని మానసికంగా మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది.

45
బుధుడు, రాహు ప్రభావం..

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 14వ తేదీన పుట్టినవారిపై బుధుడు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా తెలివైనవారు, చురుకైనవారు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే ఒకే వ్యక్తితో ఎక్కువకాలం ఉండటం వీరికి కష్టం. స్వేచ్ఛను ఎక్కువగా కోరుకోవడం, కొత్త అనుభవాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల సంబంధాల్లో అస్థిరత ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నప్పటికీ, లోపల ఎక్కడో ఒక అసంతృప్తి వీరిని వెంటాడుతుంది. అదే కారణంగా చిన్న అపోహలు కూడా పెద్ద గొడవలుగా మారి బ్రేకప్‌కు దారి తీస్తాయి.

55
శని, కేతు ప్రభావంతో..

16వ తేదీన పుట్టినవారిపై శని, కేతు ప్రభావం ఉండటంతో వీరి ప్రేమ జీవితం సాఫీగా సాగదు. ప్రేమలో మోసాలు, అకస్మాత్తుగా విడిపోవడాలు, అనుకోని బ్రేకప్‌లు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీరు చాలా నిజాయతీగా ప్రేమిస్తారు. కానీ అదే నిజాయతీ కొన్నిసార్లు వారి బలహీనతగా మారుతుంది. ఎదుటివారి అబద్ధాలను, అస్పష్టతను తట్టుకోలేక తామే సంబంధాన్ని ముగించుకునే పరిస్థితి వస్తుంది. అయితే బ్రేకప్‌లు వీరి జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories