Panchagrahi Yoga: 2026లో మేషరాశిలో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది. వారికి అపారమైన సంపద, విజయం దక్కనున్నాయి.
ఒకే రాశిలో గ్రహాలు కలిసినప్పుడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. శుభ రాజయోగాలు ఏర్పడినప్పుడు అదృష్టం రెట్టింపు అవుతుంది. అదే అశుభ రాజయోగం అయితే.. కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాగా, మే నెలలో మేష రాశిలో పంచ గ్రహ కూటమి ఏర్పడనుంది. అంటే.. ఐదు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలో కలవనున్నాయి. ఇది అత్యంత శుభకరమైన యోగం. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు.. ఈ ఐద గ్రహాలు ఒకేసారి ఈ రాశిలో చేరడంతో పంచ గ్రహ యోగం ఏర్పడుతుంది. మరి.. ఇది ఏ రాశులకు అదృష్టాన్ని తెస్తుందో ఇప్పుడు చూద్దాం…
25
మేష రాశి..
ఈ పంచ గ్రహ కూటమి మేష రాశి మొదటి ఇంట్లో సంచరిస్తోంది. దీని వల్ల ఈ రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల సపోర్ట్ తో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి.
35
మిథున రాశి
మిథున రాశికి లాభ స్థానమైన 11వ ఇంట్లో ఈ పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీంతో వీరికి ఆర్థికంగా స్వర్ణయుగం మొదలవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, పాత వ్యాపారాన్ని విస్తరిస్తారు, కొత్త బ్రాంచీలు కూడా మొదలుపెడతారు. కోల్పోయినవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించే ధైర్యం, శక్తి మీకు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలు లాభదాయకంగా మారతాయి.
సింహ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి పొందుతారు. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. దానధర్మాలు చేయడంపై ఆసక్తి పెరుగుతుంది. గౌరవప్రదమైన పదవులు పొందుతారు. ప్రభుత్వంలో కీలక పదవులు, రాజకీయ పలుకుబడి పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారు త్వరలో శుభవార్త వింటారు. బంగారం, ఆస్తులు, ఆభరణాలు, వస్త్రాలు వంటివన్నీ పొందే సమయం దగ్గరలోనే ఉంది.
55
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వారికి పంచమ స్థానమైన ఐదవ ఇంట్లో ఈ పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. ఐదవ ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. పిల్లలు మీకు గర్వకారణంగా నిలుస్తారు. పెళ్లి చర్చల్లో పురోగతి ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలను ఆశించవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబంలో సమస్యలు తగ్గి మీరు ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.