Akshay Tritiya 2024: ఈ రాశుల వారి ఇంట కాసుల వర్షం కురుస్తుంది..!

First Published | Apr 26, 2024, 2:57 PM IST

ఈ ఏడాది అక్షయ తృతీయ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ  అక్షయ తృతీయ నాడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి

yogas on Akshay tritiya

హిందూ సంప్రదాయంలో  అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిన మనం అక్షయ తృతీయను జరుపుకుంటాం. దాదాపు ఈ అక్షయ తృతీయ రోజున కనీసం గ్రాము బంగారం అయినా కొనాలి అని పరితపించేవారు చాలా మంది ఉన్నారు. కొందరేమో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయడం వల్ల ఆ రోజు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని వారు నమ్ముతారు. అక్షయ తృతీయను శుభ సమయంగా కూడా భావించారు. కొన్ని మంచి పనులను ఆరోజు ప్రారంభించేవారు కూడా ఉంటారు.

అయితే.. ఈ ఏడాది అక్షయ తృతీయ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ  అక్షయ తృతీయ నాడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ఏర్పడటం వల్ల.. కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు జరగనున్నాయి. ఆ రోజు ఎలాంటి శుభ యోగాలు ఏర్పడున్నాయో.. వాటి వల్ల ఏ రాశివారికి  అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.. 



అక్షయ తృతీయ రోజున  మేషరాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక ఉంటుంది. అంటే రెండు గ్రహాలు కలిసి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాయి, దాని వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది.అంతే కాకుండా మీనరాశిలో కుజుడు, బుధుడు కలవడం వల్ల ధనయోగం ఏర్పడుతోంది. అదే సమయంలో, శని తన సొంత రాశిలో అంటే కుంభరాశిలో ఉండబోతున్నాడు, దీని కారణంగా ఈ రోజున షష్ యోగం ఏర్పడుతుంది.
 

అలాగే మీన రాశిలో కుజుడు ఉండటం వల్ల మాళవ్య రాజయోగం కలుగుతుంది. ఇది కాకుండా, వృషభ రాశిలో చంద్రుడు , బృహస్పతి కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచినప్పుడు అతిపెద్ద యోగం ఏర్పడబోతోంది.


అక్షయ తృతీయ నాడు ఈ యోగాలు ఏర్పడటం వల్ల మూడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు జరగనున్నాయి.  ఈ మూడు రాశులు: మేషం, వృషభం, మీనం. 

ఈ యోగాల కారణంగా  మేష రాశికి అక్షయ తృతీయ నాడు భారీ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో, వృషభ రాశివారికి  ఇప్పటి వరకు పడిన కష్టాలకు విముక్తి లభించనుంది.  దీంతోపాటు వాణిజ్యం కూడా పెరుగుతుంది. ఇక మూడో రాశి మీన రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

Latest Videos

click me!