కుంభ రాశి
కుంభరాశివారికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అందుకే టాప్ 5 ఫోన్ వ్యసనపరుల్లో కుంభరాశివారు ఉన్నారు. ముందుచూపు, సృజనాత్మక ఆలోచనలకు పేరుగాంచిన ఈ రాశివారు సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండు చేతులతో స్వీకరిస్తారు. వీళ్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ యాప్స్, గ్యాడ్జెట్లను అన్వేషిస్తూ డిజిటల్ పోకడలను ముందుగానే అనుసరిస్తారు. కుంభ రాశి వారికి ఫోన్ అనేది కేవలం ఒక పరికరం మాత్రమే కాదు. ఇది వారి భవిష్యత్ ఆలోచనలకు ప్రవేశ ద్వారంగా భావిస్తారు.