These people tend to overreacts always
సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మేష రాశి..
మేష రాశివారు.. ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనేది చూడరు. గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ రాశివారికి ఉన్న అలవాటు ఇదే.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఎవరు ఏం చెప్పినా వినరు. ముఖ్యంగా వారు.. తాము అనుకున్నది నిజం అనే భావనలో ఉంటే ఇతరులు చెప్పేది పొరపాటున కూడా వినరు. ఈ రాశివారికి ఉన్న అలవాటు ఇది.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారికి ఓ చెడ్డ అలవాటు ఉంది. ఎంతసేపు వాళ్లు మాట్లాడటమే కానీ... ఎదుటి వాళ్లు చెప్పేది అస్సలు వినిపించుకోరు. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వరు.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ఓవర్ అయిపోతూ ఉంటారు.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశివారికి ఎప్పుడూ గెలవాలనే తపన ఉంటుంది. అది వారికి ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రతి విషయంలోనూ తమదే గెలుపు కావాలని ఈ రాశివారు కోరుకుంటారు.
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఓవర్ గా ఎనలైజ్ చేస్తూ ఉంటారు. అవసరం లేని దాని గురించి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు.
telugu astrology
7.తుల రాశి..
తుల రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. ఒక పట్టాన ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవడానికి అయినా రోజులకు రోజుల సమయం తీసుకుంటారు. ఎంతకీ తేల్చరు.
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. తొందరగా ఎవరినీ నమ్మరు. వాళ్లని నమ్మచ్చు...పర్లేదు అనే అభిప్రాయం వచ్చే వరకు ఎవరినీ అంత ఈజీగా నమ్మరు.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి వారికి ఉన్న అలవాటు ఏమిటంటే... వారికి ఎవరైనా ఏదైనా విషయం చెబితే... అచ్చం.. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వేరే వాళ్లకు చెప్పేస్తారు. ఒక్క పొల్లు కూడా పోనివ్వరు.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... వీరికి సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎంతలా అంటే ఎదుటి వాళ్లు బాధపడతారని కూడా చూడకుండా సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు.
telugu astrology
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... ఈ రాశివారు మంచి డిస్కషన్ జరుగుతుంటే.. దాని మధ్యలో నుంచి కూడా వెళ్లిపోతారు. అది ఎంత ఇంపార్టెంట్ అయినా.. పట్టించుకోకుండా మధ్యలోనే వెళ్లిపోతారు.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. నిద్ర. వీరు ఎక్కడ ఉన్నా కూడా పట్టించుకోండా... తమ నిద్ర టైమ్ అయితే చాలు పడుకొని నిద్రపోతారు.