సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తు గురించి అంచనా వేయొచ్చు. పుట్టిన తేదీ, సమయం వారి జీవితం గురించి లోతైన విషయాలను వెల్లడిస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు సూర్యుడి ఆశీర్వాదంతో మహ రాజులా బతికేస్తారు. ఆ తేదీలేంటో చూడండి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి తేదీకి ఒక మూల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. గ్రహ బలంతో కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు రాజయోగంతో పుడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సంఖ్య సూర్య భగవానుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరిపై సూర్యుడి ఆశీర్వాదం ఎక్కువ. సూర్యుడి దయ వల్ల వీరికే కలిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం
25
మూలసంఖ్య 1
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వ్యక్తుల మూలసంఖ్య 1. ఈ తేదీల్లో జన్మించినవారు చాలా తెలివైనవారు. వీరికి ఆత్మాభిమానం, కష్టపడి పనిచేసే తత్వం, శ్రద్ధ కలిగి ఉంటారు. అంతేకాదు మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఎక్కడున్నా నాయకుడిలాగే ఉంటారు. కుటుంబం, స్నేహితులు, తోటి ఉద్యోగులు ఎవరైనా సరే.. వీరిని ముఖ్యమైన వ్యక్తులుగానే చూస్తారు.
35
నాయకత్వ సామర్థ్యాలే పెద్ద బలం
ఈ తేదీల్లో పుట్టినవారికి వారి నాయకత్వ సామర్థ్యాలే పెద్ద బలం. వీరు ఎప్పుడూ ఇతరులను లేదా గుంపును అనుసరించరు. వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు. అంతేకాదు మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులు రాజయోగంతో పుడతారు. సూర్యుడు గ్రహాలకు రాజు అయినట్లే, వీరు కూడా రాజులాంటి జీవితం గడుపుతారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వ్యక్తులు బలమైన సంకల్పం కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు, కష్టాలను చూసి అస్సలు భయపడరు, వెనకడుగు వేయరు. ఒకసారి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే, దాన్ని సాధించే వరకు వదిలి పెట్టరు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆ లక్షణమే వీరికి విజయాన్ని తెచ్చి పెడుతుంది.
55
వీరికి నిజాయతీ ఎక్కువ
సూర్యుడి ప్రభావం వల్ల మూలసంఖ్య 1 కలిగిన వ్యక్తులు జీవితంలో అపారమైన గౌరవం, కీర్తిని పొందుతారు. సూర్యుడి ప్రభావం వల్ల వీరికి స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఎవరి మీద ఆధారపడకుండా తమ శక్తితో ఎదగాలని కోరుకుంటారు. అంతేకాదు సూర్యుడి ప్రభావం ఉన్నవారిలో నిజాయతీ, న్యాయబద్ధత ఎక్కువగా ఉంటాయి. వీరు తప్పు చేయరు, తప్పును సమర్థించరు. ఈ లక్షణం వల్ల వీరి ప్రతిష్ఠ స్థిరంగా ఉంటుంది.