Birth Date: తల్లీ కొడుకుల బంధం చాలా ప్రత్యేకమైనది. కొందరు అబ్బాయిలు పెళ్లి తర్వాత భార్యకు, తల్లికి సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఇంకొందరు ప్రతీ చిన్న విషయానికి అమ్మపైనే ఆధారపడుతుంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు అమ్మకు అధిక ప్రాధాన్యం ఇస్తారో చూద్దాం.
పిల్లలు.. తల్లిని ప్రేమించడం సహజం. వారి మాటకు విలువ ఇవ్వడం సహజం. అయితే కొంతమంది అబ్బాయిలు పెళ్లి అయిన తర్వాత భార్యకు, తల్లికి.. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు మాత్రం తల్లి మాటకు మాత్రమే విలువిస్తారు. ప్రతీ చిన్న విషయానికి అమ్మ అనుమతి కోరుతారు. కొన్నిసార్లు ఇది భార్యకు ఇబ్బందిగా అనిపించినా, తల్లిపై ఆ అబ్బాయిలకు ప్రేమ ఏమాత్రం తగ్గదట. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు తల్లిమాట జవదాటరో ఇక్కడ తెలుసుకుందాం.
25
ఈ మూల సంఖ్య కలిగిన అబ్బాయిలు
సంఖ్యా శాస్త్రం ప్రకారం 3, 6, 9 మూలసంఖ్య కలిగిన అబ్బాయిలను 'మమ్మాస్ బాయ్స్'గా చెప్తారు. వీరిపై వేర్వేరు గ్రహాల ప్రభావం ఉంటుంది. దానివల్ల వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
35
మూలసంఖ్య 3
ఏ నెలలో అయినా 3, 12, 21 లేదా 30వ తేదీల్లో పుట్టిన వారి మూలసంఖ్య 3 అవుతుంది. వీరు బృహస్పతి గ్రహ ప్రభావంలో ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ తల్లిని గొప్ప సలహాదారుగా, మార్గదర్శిగా భావిస్తారు. అమ్మ చెప్పిన ప్రతీ మాట పాటిస్తారు. పెళ్లి తర్వాత కూడా అమ్మకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
ఏ నెలలో అయినా 6, 15 లేదా 24వ తేదీన పుట్టిన వారి మూలసంఖ్య 6 అవుతుంది. ఈ నంబర్‌ను ప్రేమ, ఆప్యాయతకు చిహ్నమైన శుక్ర గ్రహం పాలిస్తుంది. అందుకే, ఈ నంబర్ అబ్బాయిలు తమ తల్లితో లోతైన భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. వీరు అమ్మకు పూర్తిగా అంకితమై ఉంటారు. జీవితంలోని ప్రతీ చిన్న నిర్ణయంలోనూ అమ్మ సలహా తీసుకుంటారు.
55
మూలసంఖ్య 9
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలో అయినా 9, 18 లేదా 27వ తేదీన పుట్టిన వారి మూలసంఖ్య 9 అవుతుంది. వీరిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు తమ తల్లి విషయంలో చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. అమ్మ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వీరికి అమ్మే పెద్ద సపోర్ట్ సిస్టమ్. ఎలాంటి కష్టకాలంలోనైనా తల్లిని విడిచిపెట్టరు.