Sun Effects: శత్రురాశిలోకి ప్రవేశిస్తున్న సూర్య భగవానుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో కష్టాలే

Published : May 04, 2026, 07:46 AM IST

Sun Effects:  జ్యోతిష్యశాస్త్రం చెప్పిన ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు. త్వరలో వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడికి, వృషభ రాశికి మధ్య శత్రుత్వం ఉంది. మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాక 4 రాశులు తమ ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

PREV
14
వృషభ రాశి

సూర్యుడికి శత్రు రాశి ఈ వృషభరాశి. ఈ రాశిలోకి మే 15న ప్రవేశించబోతున్నాడు సూర్యుడు. ఈ సంచారం వల్ల ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి కార్యాలయంలో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పనుల్లో కూడా ఆలస్యం ఆటంకాలు ఎదురవుతాయి. వీరిలో తమపై తమకు ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది. అనవసరంగా కోపం, చిరాకు పెరిగిపోతాయి. తలనొప్పి, కంటి సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

24
తులా రాశి

తులా రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సూర్యునికి శత్రువుగా చెప్పుకుంటారు. సూర్యుడి సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నవారు ఆఫీసు రాజకీయాలకు బలయ్యే అవకాశం ఉంది. వీరి కష్టానికి తగిన ఫలితాలు సాధించడం కష్టమైపోతుంది. ఆర్థిక నష్టం కూడా రావచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాటలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో లేదా జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

34
మకర రాశి

మకర రాశిని పాలించేది శని. సూర్య సంచారం ఈ మకర రాశి వారిలో విపరీతమైన సంఘర్షణను పెంచుతుంది. వృత్తిలో స్థిరత్వం తగ్గుతుంది. ఆకస్మిక బదిలీలు వంటివి జరగవచ్చు లేదా అదనపు బాధ్యతలు కూడా రావచ్చు. భవిష్యత్తు గురించి తెలియని భయాలు పెరిగిపోయి మానసిక ఒత్తిడికి గురవుతారు. గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే మీకు వారు ద్రోహం చేసే అవకాశం ఉంది.

44
కుంభ రాశి

కుంభ రాశి వారిపై సూర్యుని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు రావు. ముఖ్యమైన ఒప్పందాలు ప్రాజెక్టులు చివరి నిమిషంలో నిలిచిపోయే అవకాశాలు ఎక్కువ. తల్లి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన పెరిగిపోవచ్చు. లేదా సౌకర్యాలు, సదుపాయాలు లేక ఇబ్బంది పడతారు. సమాజంలో గౌరవం కూడా తగ్గవచ్చు. ఎలాంటి వివాదాస్పద విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories