Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్‌.. బాధ‌, కోపం రెండూ ఎక్కువే

Published : Jan 04, 2026, 09:56 AM IST

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ అతని స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని మూల సంఖ్యలు ఉన్నవారిలో అతిగా ఆలోచించే లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మూల సంఖ్య 2 ఉన్నవారు ఈ కోవలోకి వస్తారు. 

PREV
15
మూల సంఖ్య అంటే ఏంటి.. ఎలా తెలుసుకోవాలి?

ఒక వ్యక్తి పుట్టిన తేదీ అంకెలను కలిపితే వచ్చే ఒక్క అంకెనే మూల సంఖ్య అంటారు.

ఉదాహరణకు:

20వ తేదీ → 2 + 0 = 2

29వ తేదీ → 2 + 9 = 11 → 1 + 1 = 2

ఈ విధంగా 2వ, 11వ, 20వ, 29వ తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 2 అవుతుంది.

25
మూల సంఖ్య 2కి సంబంధించిన గ్రహ ప్రభావం

మూల సంఖ్య 2కి అధిపతి చంద్రుడు. చంద్రుడి స్వభావం లాగానే ఈ సంఖ్య ఉన్నవారి మనసు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఊహాశక్తి బలంగా ఉంటుంది.

35
అతిగా ఆలోచించే స్వభావం ఎందుకు వస్తుంది?

ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తారు. ప్రతి కోణంలో విశ్లేషించాలనే ప్రయత్నం చేస్తారు. ఒకే సమయంలో అనేక ఆలోచనలు రావడం వల్ల మనసు స్థిరంగా ఉండదు. దీని ప్రభావంగా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం. ఒక నిర్ణయంపై ఎక్కువసేపు నిలబడలేకపోవడం. భావోద్వేగ ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి.

45
సృజనాత్మకత, ఆకర్షణీయ వ్యక్తిత్వం

మూల సంఖ్య 2 ఉన్నవారు సృజనాత్మక ఆలోచనలతో ముందుంటారు. కొత్త ఐడియాలతో ముందుకెళ్లడం వీరి ప్రత్యేకత. అందం, ప్రేమ విషయాల్లో ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులు వీరి వైపు త్వరగా ఆకర్షితులవుతారు. కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడతాయి. సామాజికంగా కలిసిపోయే స్వభావం ఉంటుంది.

55
బలహీనతలు ఏవి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం

అతిగా ఆలోచించడం వీరి ప్రధాన బలహీనత. ఒక నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయలేరు. భావోద్వేగానికి లోనవుతారు. చిన్న మాటను కూడా మనసుకు తీసుకుంటారు. కోపం త్వరగా వస్తుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ఈ స్వభావాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే జీవితం సులభంగా మారుతుంది. ధ్యానం, స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం ఉపయోగపడుతుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాల‌ను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories