కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు..!

Published : Dec 13, 2022, 09:00 AM IST

న్యూమరాలజీ ప్రకారం ఓతేదీలో పుట్టిన వారు ..ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే పరిస్థితులు చక్కబడతాయి. ఆదర్శవంతమైన వ్యక్తి నుంచి ప్రేరణ పొంది.. మీ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. మీ పనిలో కొంత తొందరపాటు కారణంగా అది చెడిపోయే అవకాశం ఉంది. ఈసారి కాస్త ఓపిక పట్టాలి. కొత్త ఉద్యోగం పొందొచ్చు.   

PREV
110
కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు..!

 జోతిష్యం ఎలానో.. న్యూమరాలజీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం...  డిసెంబర్ 9వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం..
 

210
Daily Numerology

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఫోన్‌లో ముఖ్యమైన వారితో మాట్లాడండి. మీ పనులను కొత్త మార్గంలో చేయడానికి ప్రయత్నించండి. ఇల్లు, పని మధ్య సామరస్యాన్ని కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వ్యాపార రంగంలో కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.  దాని వల్ల పదోన్నతి పొందుతారు. కుటుంబ బాధ్యతలను కూడా పూర్తిచేస్తారు. 
 

310
Daily Numerology


సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో రోజు ప్రారంభమవుతుంది. బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిస్తారు. మీరు నైతిక విలువలు, ఆధ్యాత్మికతపైనే ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. పాత ఆలోచనల కంటే కొత్త ఆలోచనలకు ప్రాధాన్యతనివ్వండి. మార్పుకు ఇది మంచి సమయం. భూ సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించండి. తొందరపాటు మంచిది కాదు.  భావోద్వేగం వల్ల కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. 
 

410
Daily Numerology

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సౌకర్యవంతంగా ఉంటారు. సామాజిక పరిమితులు పెరుగుతాయి. అందరి అంచనాలను అందుకుంటారు. ఇంట్లోని పెద్దలు లేదా అనుభవజ్ఞులు మీకు సరైన మార్గదర్శకత్వం చేస్తారు. మధ్యాహ్నం సమయ కొంత భిన్నంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రయోజనకరమైన ఆఫర్లను పొందుతారు. 

510
Daily Numerology

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు మీరు భగవంతుని ఆరాధన, యోగా వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రియమైన వ్యక్తుల నుంచి అందమైన బహుమతులను పొందుతారు. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ రహస్య శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అందరి ముందు మీ ఆలోచనలను బహిర్గతం చేయకండి. కుటుంబ సభ్యుల సహకార విధానంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇంట్లో ఒకరు అనారోగ్యం బారిన పడొచ్చు. 
 

610
Daily Numerology

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఏదైనా దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు లేదా చాలా సమర్థవంతంగా, ప్రశాంతంగా పని చేస్తారు. పిల్లలు మీ మాట వింటారు. ఇంటర్వూలో బాగా రాణించగలుగుతారు. మీ వాయిస్‌తో మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. బంధువులు మిమ్మల్ని చూసి అసూయ పడతారు. ఇక రాజకీయ పనుల్లో వేగం ఉంటుంది. కుటుంబంతో కలిసి బట్టలు, ఆభరణాలు కొంటారు. ప్రమాదకరమైన కార్యకలాపాలను నివారించండి.
 

710
Daily Numerology

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ సమయంలో మీ సన్నిహిత సంబంధాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చదువుతున్న వారు తమ లక్ష్యంపై దృష్టి సారించి లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన కార్యకలాపాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు కుట్రలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి.

810
Daily Numerology

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీకు ఎలాంటి ముఖ్యమైన పనులు ఉండవు. కొన్ని పరిస్థితుల వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అజాగ్రత్తగా ఉంటే మీ పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇతరుల విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకండి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం ఉంటుంది. దూర ప్రయాణాలు ఫలవంతంగా, లాభదాయకంగా ఉంటాయి.
 

910
Daily Numerology


సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే పరిస్థితులు చక్కబడతాయి. ఆదర్శవంతమైన వ్యక్తి నుంచి ప్రేరణ పొంది.. మీ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. మీ పనిలో కొంత తొందరపాటు కారణంగా అది చెడిపోయే అవకాశం ఉంది. ఈసారి కాస్త ఓపిక పట్టాలి. కొత్త ఉద్యోగం పొందొచ్చు. మీ వ్యాపార ప్రణాళికలు, కార్యకలాపాల గురించి ఎవరితోనూ మాట్లాడకండి. ఇంట్లోని సభ్యుని నిశ్చితార్థానికి సంబంధించి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు శక్తివంతంగా ఉంటారు. 
 

1010
Daily Numerology


సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మతపరమైన పనిలో పాలు పంచుకునే అవకాశం ఉంది. కుటుంబం,స్నేహితులతో కొంత సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకోండి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కొన్ని సూత్రాలు, సమగ్ర విధానాన్ని కలిగి ఉంటారు. మధ్యాహ్న సమయంలో కొన్ని చెడు వార్తలు  వింటారు. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇంట్లో పెద్దల పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం వల్ల మీపై గౌరవం తగ్గుతుంది. అందుకే వారి కోసం సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. ఈ రోజు వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.
 

Read more Photos on
click me!

Recommended Stories