న్యూమరాలజీ: మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి..!

First Published Dec 10, 2022, 9:00 AM IST

న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి.. అనుభవజ్ఞులైన, ఇంటి పెద్దల ఆశీర్వాదం, మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. మీకు ఇష్టమైన కార్యకలాపాలతో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. మధ్యాహ్న సమయంలో ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
 

జోతిష్యం ఎలానో.. న్యూమరాలజీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం...  డిసెంబర్ 9వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం..
 

Daily Numerology

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు గ్రహాల భ్రమణం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇందుకోసం మీ కృషి మాత్రమే అవసరం. శ్రేయోభిలాషి సహాయం మీకు ఎంతో మేలు చేస్తుంది. విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు పట్ల మరింత చురుకుగా ఉంటారు. ప్రియమైన వ్యక్తుల నుంచి చెడు వార్తలు వింటారు. దీనివల్ల బాధలో ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడతారు. వాహనం లేదా ఏదైనా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరానికి నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. భార్యాభర్తలిద్దరూ బిజీగా ఉండటం వల్ల ఒకరికొకరు సమయం ఇవ్వలేకపోతారు. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.

Daily Numerology


సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీకు రోజు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందలు లేకుండా ప్రారంభమవుతుంది. భావసారూప్యత గల వ్యక్తులను కలవడం వల్ల కొత్త శక్తి వస్తుంది. మీ లక్ష్య సాధనలో సోదరులు కూడా పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో  కొంత ఒత్తిడి కలుగుతుంది. మరో పక్క పరిస్థితి చేయి దాటిపోతోందని టెన్షన్ పడతారు. సహనం, సంయమనంతో మీ సమస్యను అధిగమిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విధి, గ్రహాలు వ్యాపారంలో మీకు అనుకూలంగా పని చేస్తాయి. భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 
 

Daily Numerology

సంఖ్య 3  (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ సమయం ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. మీ విశ్వాసం కూడా కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఇంటిని చక్కదిద్దడానికి మీరు చేసిన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. మతపరమైన కార్యక్రమానికి కూడా ప్రణాళికలు వేసుకుంటారు. ఇతర విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మానుకోండి. ఇది వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణం చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ పరిస్థితి పూర్తిగా దిగజారుతుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో ఎక్కువగా నిమగ్నమవుతారు. కుటుంబం, వ్యాపార కార్యకలాపాల మధ్య సరైన సమన్వయం నిర్వహిస్తారు. రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
 

Daily Numerology

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

రోజు మీకు ఒక ఆహ్లాదకరమైన సంఘటనతో ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాల్లో విజయం సాధించవచ్చు. స్నేహితులు లేదా సహోద్యోగులతో ఫోన్‌లో సంభాషణ సరైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు మీ ప్రణాళిక ప్రకారమే పనిచేస్తారు. అకస్మాత్తుగా సమస్యలు రావొచ్చు. ఆదాయ వనరు పెరుగుతుంది.  కానీ అదే సమయంలో అధిక ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. పని ప్రాంతంలో పనిభారం మరింత పెరగొచ్చు. వివాహంలో కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
 

Daily Numerology

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

అనుభవజ్ఞులైన, ఇంటి పెద్దల ఆశీర్వాదం, మద్దతు మీపై ఎప్పుడూ ఉంటుంది. మీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. మీకు ఇష్టమైన కార్యకలాపాలతో గడపడం వల్ల  ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. మధ్యాహ్న సమయంలో ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ బడ్జెట్‌ను మరింత దిగజార్చుతుంది. పనిభారం ఎక్కువగా ఉండొచ్చు. ప్రస్తుతానికి ప్రస్తుత కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. అలసట వల్ల కాళ్లలో నొప్పి,  వాపు వంటి సమస్యలు వస్తాయి. 

Daily Numerology


సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ పనికి మరింత  గుర్తింపును తీసుకురావడానికి సృజనాత్మక కార్యకలాపాల సహాయం తీసుకుంటారు. దీంతో మీరు విజయం సాధిస్తారు. గృహ సౌఖ్యాలకు సంబంధించిన పనిలో కూడా మీకు పూర్తి సహకారం ఉంటుంది. ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. వివాహితులు అత్తమామలతో ఎలాంటి అభిప్రాయభేదాలు కలిగి ఉండకపోవచ్చు. ఎక్కువ పని చేయడం వల్ల చిరాకు వస్తుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీరు వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోవచ్చు. భార్యాభర్తల బంధంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలసట, ఒత్తిడి శారీరక బలహీనతకు దారితీస్తుంది.
 

Daily Numerology

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కొత్త ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. సన్నిహితుల సహాయంతో ఆ ప్రణాళికలను ప్రారంభిస్తారు. ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండండి. మితిమీరిన దాతృత్వం బాధిస్తుంది. కొన్నిసార్లు మీ కోపం మీకు సమస్యలను కలిగిస్తుంది. మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఒత్తిడి కారణంగా తగినంత నిద్ర ఉండదు. వివాహ సంబంధాన్ని మధురంగా ​​ఉంచడంలో మీకు ప్రత్యేక సహకారం ఉంటుంది. శారీరక, మానసిక శక్తిని సానుకూలంగా ఉంచడానికి యోగా, ధ్యానం చేయండి. 
 

Daily Numerology

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ దృష్టి మొత్తం ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడంపైనే ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు కూడా ఉంటాయి. స్నేహితులతో కలిసి సమయాన్ని వృథా చేయకండి. కష్టపడి పని చేసే సమయం ఇది. బడ్జెట్‌కు మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. మీ దృష్టిని పూర్తిగా పనిపైనే ఉంచండి. బయటి వ్యక్తి ఇంటిని నాశనం చేయొచ్చు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, వాపు ఉంటుంది.

Daily Numerology

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు మీరు ఒక ప్రత్యేక పనిని పూర్తి చేస్తారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో, వారి సమస్యలకు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇలా చేయడం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. నెగెటివ్ టాక్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. ఇది మీకు ఒత్తిడిని మాత్రమే కలిగిస్తుంది. లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలలో విజయం లభిస్తుంది. ప్రత్యేక వ్యక్తి సహకారం మీకు అదృష్టాన్ని తెస్తుంది. అధిక పని.. ఒత్తిడి, రక్తపోటును ప్రభావితం చేస్తుంది.

click me!