2023లో ధనస్సు రాశివారి ఫలితాలు..!

First Published | Dec 9, 2022, 11:00 AM IST

నూతన సంవత్సరం 2023లో ధనస్సు రాశివారి కి ఓ నెలలో  మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. 

Sagittarius

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Vijaya Rama krishna


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


Sagittarius

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):


2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.   శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.  ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి. నవగ్రహ సందర్శనం మంచిది.

Sagittarius Zodiac

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
 
ఈ నెలలో పనులు ఒత్తిడి అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
 
 లవ్ లైఫ్ : కుటుంబ సభ్యులతో  భేదాభిప్రాయాలు పెరుగుతాయి. మానసిక అలసట ఏర్పడును.  దానికి అధిగమించటానికి నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మీ లైఫ్ పార్టనర్ ని ఆనందపరచటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. అపార్ధాలకు తావులేకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు . తోటివారిని కలుపుకొనిపోవడం ద్వారా మేలు జరుగుతుంది. 
 
 ఆరోగ్యం:    ఆరోగ్యం బాగుంది. స్వల్ప అనారోగ్యాలు ఉన్నా..వాటితో  కొత్తగా వచ్చే సమస్యలు ఏమీ ఉండవు .  హృద్రోగులు  చిన్నచిన్న చికాకులు పొందే అవకాశం ఉంటుంది.  

ఫిబ్రవరి 2023

ఈ నెలలో  మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ప్రయత్నఅనుకూలత ఉంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్తులకి అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టువదలకండి.  సహోద్యుగలతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  నూతన అనుబంధాల ఏర్పడతాయి.  వ్యాపారస్దులుకు ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. 


లవ్ లైఫ్:  కుటుంబ విషయాల్లో  బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బందుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
  
 ఉద్యోగం-వ్యాపారం:  ఈ నెల లో ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్‌, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. 

ఆరోగ్యం:  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమయానికి ఆహారనియమాలను పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. 

Astro

మార్చి 2023

ఈ రాశివారికి  సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో శుభఫలితాలు ఉంటాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురవకుండా చూసుకోవాలి. ఉత్సాహవంతంగా పనులు చేయాలి.  లక్ష్మీదేవి   ఆరాధన ఉత్తమం.

లవ్ లైఫ్ :  లైఫ్ పార్టనర్ తో  మీకు కలిసివస్తుంది.  అయితే వారి  ఆరోగ్య విషయమందు జాగ్రత్త వహించాలి. మీ మధ్యలోకి వచ్చి తగువులు పెట్టే బంధు వర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 

ఉద్యోగం-వ్యాపారం: ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.  అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. 

ఆరోగ్యం:  ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును.    శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును.  అప్పుల ఒత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు.

ఏప్రియల్  2023

ఈ నెల   మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికమగును. పనుల యందు ఆటంకములు ఏర్పడును. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.
 
లవ్ లైఫ్ : జీవన భాగస్వామి  తో ఆచితూచి మాట్లాడాలి. కొన్ని విషయాలు చికాకు కలిగిస్తాయి. ఇకపై అలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి.  ఫలితంగా మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.

ఉద్యోగం-వ్యాపారం:  ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది.   
 
ఆరోగ్యం: ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. విసుగ్గా ఉండును. బంధు ర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత  ఆరోగ్య విషయంలో ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Sagittarius Zodiac

మే  2023

ఈ నెల లో సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.   కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

లవ్ లైఫ్ :   మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

ఉద్యోగం-వ్యాపారం:   వ్యాపారస్దులకు ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. ఉద్యోగస్దులు  నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

ఆరోగ్యం:    అనారోగ్య బాధలు ఉండవు. కుటుంబ సబ్యులకు సహకరించే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం,సంతానం విషయంలో మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

జూన్   2023
 
ఈ నెలలో మీరు అనుకున్న పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభఫలితాలు ఉంటాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురవకుండా చూసుకోవాలి. చైతన్యవంతంగా పనులు చేయాలి. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి   ఆరాధన ఉత్తమం.

లవ్ లైఫ్ :   కుటుంబ జీవనంలో ప్రశాంతతకు మాటే ముఖ్యమని గుర్తించండి. నోరు జారితే తీసుకోలేము. మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి.  అవి ఆనందాన్ని కలిగిస్తాయి.

ఉద్యోగం-వ్యాపారం:  వ్యాపారంలో కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగస్దులు ఆఫీస్ లో ..ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

ఆరోగ్యం: ఆరోగ్య విషయాల్లో చిన్న పాటి జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా గడుస్తుంది. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఇన్సూరెన్స్ వంటి వాటిపై ఖర్చులు బాగా పెడతారు.ఆరోగ్య విషయాలలో  కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.

జూలై   2023

ఈ నెలలో మీకు మధ్యస్తముగా ఉన్నది. ఊహించని విధంగా శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు.  ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

లవ్ లైఫ్ : మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలా ధైర్యం చెప్తుంది. వారి మాటలు, సలహాలు, ప్రవర్తన మిమ్మలని విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ ఇద్దరి మధ్య సఖ్యత లోపం ఉన్నా కొద్దిపాటి సహనం, తెలివితో పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగ ఒత్తిడి కుటుంబంపై పడనీయకండి. శుభకార్యాలకు తరుచు హాజరవ్వండి.

ఉద్యోగం- వ్యాపారం:   ఉద్యోగస్తులకు ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిడి కలిగే సూచనలున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించండి.

 ఆరోగ్యం:    ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. బ్లడ్ షుగర్ కు  సంబంధించిన రెగ్యులర్ చెక్-అప్ లను చేసుకోవడం మంచిది. ఇవేమీ మీ సాధారణ ఆరోగ్యానికి,పనులకు అంతరాయం కలగదు.  మీ ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మీరు ఆల్టర్నేటివ్ వైధ్య విధానాలు వైపు చూస్తూంటారు.
 

ఆగస్ట్    2023

 ఈ నెల   మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబసమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మరిన్ని శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

 లవ్ లైఫ్ : స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు బాధిస్తాయి.  మీ కుటుంబంలో జరిగిన వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. బ్యాచులర్స్ కు వివాహాలు కుదిరే కాలం. 

ఆరోగ్యం:  ఆకస్మిక ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ఉద్యోగం- వ్యాపారం:సాప్ట్ వేర్   ఆఫీస్ లలో తోటి ఉద్యోగులతో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్దులు  ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.

సెప్టెంబర్    2023

ఈ నెలలో మీకు అన్ని విధాలా  అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

లవ్ లైఫ్ :  మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను అందిస్తుందీ ఈ నెల. అయితే  ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ లైఫ్ పార్టనర్ దగ్గర నమ్మకం కోల్పోవద్దు.

ఉద్యోగం- వ్యాపారం: వ్యాపారులు లాభదాయకమైన కాలాన్ని అనుభవిస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. ఉద్యోగస్దులు సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

ఆరోగ్యం:   అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. ఆహార, విహారాల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

అక్టోబర్    2023

ఈ నెలలో  కుజుని ప్రభావంచేత కుటుంబములో కలతలు..అన్న దమ్ముల మధ్య వాగ్వివివాదాలు అయ్యే అవకాశముంది. మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉన్నప్పటికి అనుకున్న పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించండి.

లవ్ లైఫ్ :   మీ భాగస్వామి  తో మీరు ఆనందరకమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే  ప్రేమికులకు ఇది కలిసొచ్చేకాలం. అన్నీ సానుకూలం అవ్వుతాయి.  కుటుంబంలో  జరిగే వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి.  ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు.

ఉద్యోగం- వ్యాపారం:    ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము.మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.  

ఆరోగ్యం:   ఈ నెలలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని అర్దమవుతుంది. మీ ఆరోగ్యాన్ని  మీరు క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది. ముందే గమనించుకుంటే ఏది సమస్య కాదు. అలాగే చిన్న చిన్న చిట్కాలతో సమిసి పోయే వాటిని పెద్దవి చేసుకోవద్దు. అప్రమత్తతే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

Sagittarius

నవంబర్    2023

ఈ నెలలో మీరు తీసుకునే వృత్తిపర  కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకొనిపోతే ఇబ్బందులు ఉండవు.  సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభఫలితాలు ఉంటాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసటకు గురవకుండా చూసుకోవాలి.  ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే మంచి ఫలితాలను పొందుతారు.గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.

లవ్ లైఫ్ : జీవన భాగస్వామితో విభేదాలు ఉన్నా త్వరలోనే అవి సమిసిపోతాయి. టెన్షన్ పెట్టుకోవద్దు. నోటిని నియంత్రించుకుంటే మంచిది. చేసే ప్రతీ పనికి కొంత అనుకూల ఫలితములు ఉంటాయి. 

ఆరోగ్యం:     కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. అందుకు అవసరమైన డబ్బు విషయమై బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

 ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగంలో భాగంగా   ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. 

 డిసెంబర్    2023

ఈ నెల  మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.  అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త.  లక్ష్మీదేవి   ఆరాధన ఉత్తమం.

లవ్ లైఫ్ :  కుటుంబం ఆర్దిక విషయమై టెన్షన్ లో ఉన్నప్పుడు  ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కుటుంబంలో రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం: ఆరోగ్య సమస్యలు కొంత అధికమగుతాయి. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

ఉద్యోగం- వ్యాపారం :  వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు.అయినా  పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు మాత్రమే పూర్తి చేస్తారు.

Latest Videos

click me!