జోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం రాశులను మార్చుకున్నప్పుడు మాత్రమే కాదు, అవి స్థానాలను మారినప్పుడు కూడా మన జీవితాలు తలకిందులు అవుతాయి. ముఖ్యంగా మన జాతకంలో 6,8 స్థానాలను అశుభంగా భావిస్తారు. గ్రహాలు ఈ స్థానాల్లో కదిలినప్పుడు మనకు అశుభం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్ 7, 2025 న మంగళ గ్రహం సింహ రాశిలోకి అడుగుపెడతాడు. జులై 28 వరకు ఉంటాడు. జూన్ 7 నుంచి జులై 28వ తేదీ వరకు శని, మంగళ షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది ఐదురాశుల వారికి కష్టకాలం తెచ్చి పెట్టనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..