Maha Rajayogam: జూన్ 2 నుండి ఈ 3 రాశుల వారి అదృష్టాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు..!

Published : Apr 28, 2026, 10:34 AM IST

Maha Rajayogam: 2026లో జోతిష్యశాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన శుభయోగం ఏర్పడబోతోంది. దీనిని హంస మహారాజయోగం అంటారు. గురు గ్రహం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశులకు విపరీతమైన రాజయోగం పట్టనుంది. 

PREV
14
మహా రాజయోగం పట్టే రాశులు...

హంస మహాపురుష రాజయోగం పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం ఏర్పడితే వ్యక్తి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ముఖ్యంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. సంతోషంగా జీవిస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు పెరుగుతాయి. జీవితంలో ముందుకు వెళ్లాలనే కోరిక నిజమౌతుంది. మరి, అదృష్టం పెరిగే రాశులు ఏంటో చూద్దాం...

24
1.కర్కాటక రాశి...

ఈ యోగం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే రాశి కర్కాటక. ఎందుకంటే గురు అదే రాశిలో ఉన్నత స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. పెళ్లి కోసం చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమై పూర్తి అయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

34
2.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి కూడా ఈ యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత సమస్యలు తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం మారాలని అనుకునేవారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాత అప్పులు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు కేసులు ఉంటే వాటిలో కూడా మంచి ఫలితాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది.

44
3.మీన రాశి..

మీన రాశి వారికి కూడా ఈ యోగం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరగడం తో పాటు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయం లభిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ జ్యోతిష్య నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలితాలు వేరుగా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలను విశ్వాసంతో పాటు జాగ్రత్తగా కూడా చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories