Name Astrology: ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు వస్తే.. అత్తారింటిలో ఐశ్వర్యమే

Published : Feb 20, 2025, 04:03 PM IST

పేరు అదృష్టాన్ని తీసుకొస్తుందా.? ఇది మనలో చాలా మందికి ఉండే సందేహం. అయితే ఇది ముమ్మాటికీ వాస్తవం అని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. మన జన్మ నక్షత్రం, పుట్టిన సమయం ఆధారంగానే మన పేరు నిర్ణయిస్తారని తెలిసిందే. ఇక మన జీవితంలోకి వచ్చే వ్యక్తుల ద్వారా కూడా మన ఆర్థిక పరిస్థితులు మారుతాయని పండితులు చెబుతుంటారు..   

PREV
15
Name Astrology: ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు వస్తే.. అత్తారింటిలో ఐశ్వర్యమే

వివాహం ప్రతీ వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన. పెళ్లికి జీవితంలో కీలక పాత్ర ఉంటుంది. అందుకే వివాహం చేసుకునే ముందు కచ్చితంగా జాతకాలను చూసుకుంటారు. టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో కూడా జాతకాలను కచ్చితంగా విశ్వసిస్తుంటారు. పెళ్లి తర్వాత కొందరి జీవితాలను మారడం గమనించే ఉంటాం. అనుకోకుండా అదృష్టం కలిసి రావడం, ఉన్నట్లుండి ఆర్థికంగా ఎదగడం వంటివి వింటుంటాం. దీనికి కారణం ఇంట్లో అడుగుపెట్టే అమ్మాయి వల్లే అని పండితులు చెబుతుంటారు. కొన్ని అక్షరాలతో పేర్లున్న అమ్మాయిలు అత్తారింటికి అదృష్టాన్ని తీసుకొస్తారని పండితులు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25

P అక్షరంతో పేరున్న అమ్మాయిలు: 

ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు జీవితంలోకి వస్తే ఆనందం మీ సొంతమవుతుందని పండితులు అంటున్నారు. ఈ మహిళలు భర్త కష్టాల్లో తోడుగా ఉంటారు. అలాగే వీరు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా, సామాజికంగా అత్తారిళ్లు వృద్ధిలోకి వస్తుందంటా. 

35

K అక్షరంతో పేరుంటే: 

ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరుండే అమ్మాయిలు అదృష్టానికి మారుపేరని చెబుతంటారు. వీరి నివసించే ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి డోకా ఉండదని శాస్త్రం చెబుతోంది. వీరు పుట్టినింటిని వీడి అత్తారింటికి వెళ్లగానే అత్తారింటిలో కొత్త శోభ సంతరించుకుంది. అలాగే వీరు భర్తలకు, అత్తామామలకు మంచి గౌరవం ఇస్తారు. తమ తెలివితేటలతో ఇంటిని చక్కదిద్దుతారు. 
 

45
marriage calls off

G అక్షరంతో పేరుంటే: 

వీరు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. ఈ అక్షరంతో పేరున్న వారితో ఏ పనిచేసినా సక్సెస్‌ అవుతుంది. వీరు ఎక్కువ వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టమైన సమయాల్లో అండగా నిలుస్తారు. మంచి సలహాలు ఇస్తారు. ఈ అక్షరంతో పేరున్న అమ్మాయి భార్యగా వస్తే భర్త సుడి మారాల్సిందేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 
 

55
marriage

L అక్షరంతో: 

ఎల్‌ అక్షరంతో పేరున్న మహిళలు అదృష్టం, సంపాదకు చిహ్నంగా చెబుతుంటారు. అత్తారింటికి వెళ్లిన తరువాత వారి ఇంట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ తొలగిపోతాయని అంటారు. ముఖ్యంగా ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్న భర్తల ఉద్యోగ జీవితం మెరుగువుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ అక్షరంతో పేరున్న వారుండే చోట ప్రశాంతంగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories