Planetary Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో మార్చి మూడో వారం ఎంతో కీలకమైనది. ఆ సమయంలో కొన్ని గ్రహాల కదలిక రాశి చక్రంపై ప్రభావాన్ని చూపిస్తుంది. రాహువు, బుధుడు, శుక్రుడు ఒకేసారి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు
మార్చి మూడవ వారం వచ్చేస్తోంది. బుధుడు, శుక్రుడు, రాహువు గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి జీవితం సవాలుగా మారుతుంది. ఆ రాశుల వారు ఎంత ప్రయత్నించినా అనుకున్న ఫలితాలు రాక ఇబ్బంది పడతారు. చిన్నచిన్న పనులు కూడా ముందుకు సాగకుండా ఆలస్యం అవుతూ ఉంటాయి. పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఏప్రిల్ 11 వరకు మూడు రాశుల వారికి ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.
24
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధ, రాహువు, శుక్రుడు గ్రహాల కలయిక ఇబ్బందిగా మారుతుంది. ఏప్రిల్ 11 వరకు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మాటను అదుపులో పెట్టుకోవాలి. ప్రవర్తనను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. కొన్నిసార్లు సరదాగా అన్న మాటలు కూడా పెద్ద గొడవలకు కారణం అవుతాయి.
34
కన్యా రాశి
కన్యా రాశి వారికి మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 11 వరకు కష్ట కాలం నడుస్తుంది. ఈ సమయం కొంచెం ఓపికగా ఉండాలి. పూర్తవుతాయనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అదృష్టం కలిసి రాదు కాబట్టి ఆదాయం తగ్గినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో పెద్ద సమస్య కమ్యూనికేషన్‌కు సంబంధించి ఉండవచ్చు. వీరి మాట తీరు కారణంగా వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కోర్డు వరకు సమస్యలు వెళ్లవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారే ఆలోచన చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఏప్రిల్ 11 వరకు ఓపికగా ఉంటే మంచిది.