ఈ రాశివారికి భయం ఎక్కువ.. ఎంతలా అంటే..!

First Published Sep 2, 2021, 11:55 AM IST

ఇన్ సెక్యురిటీ ఎక్కువగా ఉండేవారి వెంట అపజయం అలవాటుగా మారుతుంది. వారిపై వారికి కనీసం నమ్మకం కూడా ఉండదరు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు


ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉన్నవారే.. జీవితంలో ముందుకు వెళ్లగలరు. అలా కాకుండా.. నిత్యం అభద్రతా భావంతో.. భయంతో బతికేవారు.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏదీ సాధించలేరు. ఇన్ సెక్యురిటీ ఎక్కువగా ఉండేవారి వెంట అపజయం అలవాటుగా మారుతుంది. వారిపై వారికి కనీసం నమ్మకం కూడా ఉండదరు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ఏది జరిగినా.. దానిని తమపై వేసుకొని.. తమపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చట. జోతిష్యం ప్రకారం.. ఈ ఐదు రాశుల వారు అలాంటి సమస్యతో ఎక్కువ బాధపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ రాశులేంటో ఓసారి  చూద్దాం...

1.కర్కాటక రాశి.

ఈ రాశివారు చాలా సెన్సిటివ్. ప్రతిదీ పర్సనల్ గా తీసుకుంటారు. ఎక్కువగా ఇతరులపై ఆధారపడుతుంటారు.  తమపై తాము ఎక్కువగా నమ్మకం ఉంచరు. తాముు ఇష్టపడే వారు కేరింగ్ చేయకపోతే.. చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలౌతుంటారు.

2.కన్య రాశి..

ఈ రాశివారు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు.. అయితే.. అది సాధ్యం కాని సమయంలో.. వారిపై వారే  నమ్మకాన్నికోల్పోతుంటారు.  తమలో ఉన్న ఫ్లస్ పాయింట్స్ ని చూడకుండా.. ఎక్కువగా నెగిటివ్స్ వెతుక్కుంటూ ఉంటారు.  అది వారికి మైనస్ గా మారే ప్రమాదం ఉంది. దీంతో.. ఇన్ సెక్యురిటీ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది.

3.తుల రాశి..

ఈ రాశివారికి సహజంగా సిగ్గు ఎక్కువ. మనసులోని విషయాన్ని బయటపెట్టడానికి జంకుతుంటారు. ఎవరైనా తమ గురించి ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు. ఈ విషయంలో వీరిలో ఇన్ సెక్యురిటీ ఫీలింగ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది.

4.మీన రాశి..

ఎదుటివారికి ఏం కావాలో బాగా అర్థం చేసుకుంటారు. దాని కోసం ఏదైనా చేస్తారు. కానీ.. తమకు ఏం కావాలో.. వాటిని ఎలా నేరవేర్చుకోవాలో మాత్రం క్లిరిటీ ఉండదు. ఏవరు ఏది అడిగినా వెంటనే నో చెప్పలేరు. మీ అభిప్రాయాలను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోలేరు. అన్నీ తరులకు చేయడంలోనే మీరు అసలిపోతారు. మీకీంటూ మీరు ఏం చేసుకోలేరు. 

click me!