మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో మిత్రుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొట్టిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు లభించును. రావలసిన ధనం చివరి నిమిషంలో లభించి పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన భాద్యతలు తీసుకోవలసి వస్తుంది. పుత్ర సంతాన సంబంధ శుభ వార్త పొందుటకు సూచనలు ఉన్నవి. మేష రాశికి చెందిన స్త్రీలకు ధనం వలన సౌఖ్యం లభిస్తుంది.ఆర్ధికంగా బలపడుదురు. మిత్రుల వద్ద ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. చివరి వారంలో మానసిక ఒత్తిడి , అంచనాలు తలక్రిందులు అవుట వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కొత్త ప్రాజెక్టులు చేపట్టుట లేదా ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో వారసత్వ సంబంధమైన లేదా కళత్ర మూలక ధన సంపదల వలన ఆర్ధిక సౌఖ్యం పొందుతారు. వ్యాపారములు బాగా నడుస్తాయి. లాభములు ఆశించిన స్థాయిలో ఉండును.వివాహ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. సోదర వర్గీయులతో మాట తగాదాలు ఏర్పడు అవకాశం ఉన్నది. మీ శ్రమ ఫలించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఆద్యాత్మిక భావాలూ పెంపొందుతాయి. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి సంబందించిన అనారోగ్య సమస్యలు ఆందోళన ఏర్పడును. చివరి వారం గత కాలంలో నిలిపి వేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు అనుకూల కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో సోదర వర్గంతో వివాదముల మూలంగా ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచన కలదు. అనవసర ప్రయాణాలు చేయుదురు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలుగచేయును. నివసిస్తున్న గృహంలో మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తిఅగును. మీరు మంచి చెప్పినా ఎదుటి వారు లెక్క చేయని పరిస్తితులు ఎదురగును. చివరి వారంలో వాహన ప్రమాదం ఎదుర్కోను సూచన లేదా ఆరోగ్య రుగ్మతలు బాధించును. 24వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 21, 24 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ప్రయత్న ఆటంకములు ఎదురైనా అంతిమంగా విజయం లభించును. ధనాదాయం సామాన్యం గా ఉండును. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.యుక్తితో సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ , తృతీయ వారములు వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం పొందును. ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. 23 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య కాలంలో కుటుంబ పెద్దలతో గొడవల వలన మానసిక అశాంతి ఎదురగు సూచన ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ఆధ్యాత్మిక జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. ముఖ్యంగా అర్చకత్వం వంటి పవిత్ర సేవలో ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడును. కుటుంబ విషయాల్లో సభ్యుల మధ్య మాట కలవదు. స్త్రీ సంబంధ వివాదాములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు మందకొడిగా కొనసాగును. దూరప్రాంత ప్రయాణములు. కోర్టు వ్యవహారములలో అననుకూలత ఎదుర్కొందురు. నిరుద్యుగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. జీవన మార్గం శ్రమతో కూడి ఉండును. ఈ మాసంలో 13 నుండి 19వ తేదీ మధ్య ప్రయాణములు చేయుట మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అంతగా అనుకూల ఫలితాలు లభించవు. ఒక చిన్న శస్త్రచికిత్స , గృహంలో చొర నష్టం వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కార్యభారం పెరుగును. దూరప్రాంత ప్రయాణములు నష్ట పరచును. ప్రయాణాలు వాయిదా వేయండి. మనోవేదన ఎదుర్కొందురు. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. పెట్టుబడులు కొరకు చేయు ప్రయత్నాలు ఫలించవు. బాగా ఎదిగిన సంతానముతో కొద్దిపాటి విరోధములు ఏర్పడును. ఉద్యోగ జీవనం సామాన్యం గ కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. ఈ మాసంలో ప్రతీ సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. ఆరోగ్య సమస్యలు నెమ్మదించును. కొత్త వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సమేతంగా చేయు ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. ఆదాయం సామాన్యం.ఈ మాసంలో కొన్ని వయస్సుకు మించిన విపరీత అనుభవాలు ఎదుర్కొనుటకు సూచనలు కలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. ఆరోగ్య సమస్యలు నెమ్మదించును. కొత్త వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సమేతంగా చేయు ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. ఆదాయం సామాన్యం.ఈ మాసంలో కొన్ని వయస్సుకు మించిన విపరీత అనుభవాలు ఎదుర్కొనుటకు సూచనలు కలవు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో మీ గృహ సంబంధ ప్రణాళికలు కార్యరూపం దాల్చును. ఆప్త మిత్రులతో చిన్నపాటి కలహం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి న్యాయబద్ధమైన ధనార్జన ఏర్పరచు ఉద్యోగ జీవనం ఆరంభం అగును. వృత్తి వ్యాపారములు జయవంతంగా కొనసాగును. వివాహ సంబంధ చర్చలు సఫలమగుటకు చాలా కష్ట పడవలసి వస్తుంది. మధ్యవర్తులను అతిగా నమ్ముట మంచిది కాదు. ఈ మాసంలో 7,8,9,10 తేదీలలో భూ లేదా గృహ సంబంధ మార్పులు లేదా పెట్టుబడులు లాభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ లేదా వస్తు మార్పిడి సంబంధమైన పనులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతి ని ఆశించవచ్చు.మీ పనుల పట్ల శ్రద్ధా శక్తుల వలన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం వలన మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వినుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అంతగా అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ప్రయాణ సంబంధ చికాకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తరపు బందువులకు సంబందించిన అశుభ వార్తలు వినుదురు. కందెన వ్యాపారములు చేయువారికి లాభములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో సంబంధములు ఖాయం అగును. తృతీయ వారంలో చిన్న అనారోగ్య సూచన లేదా వాహన ప్రమాదం నుండి తప్పించుకొను సంఘటనలు ఏర్పడును. ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ధనాదాయం సామాన్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో ప్రధమ వారంలో ఒక అశుభ వార్త మిమ్మల్ని భాదిస్తుంది. అనవసర తగాదాల వలన మనో విచారం ఏర్పడుతుంది. తెలిసిన వ్యక్తుల వలన ఆర్ధిక నష్టం ఎదుర్కొంటారు. జాగ్రత్త అవసరం. 5 నుండి 17 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు లేదా ఉద్యోగ నష్టం. రక్త సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి జాగ్రత్త అవసరం. ప్రయత్నాలలో అదృష్ట రాహిత్యత వెంటాడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య