Morning Astro Tips: పొద్దున్నే లేవగానే మీరు చేసే పని ఏంటీ? అయితే ఫోన్‍లో రీల్స్ చూడటం, లేదంటే హడావిడిగా బయల్దేరడం. అలా కాకుండా నిద్రలేవగానే భగవంతుడిని, తల్లిదండ్రుల పేర్లను జపించడం వల్ల మీ జీవితంలో ఎంతో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చాలా మంది ఉదయాన్ని హడావిడిగా మొదలుపెడతారు. లేస్తూనే ఫోన్ చూడటమే పనిగా పెట్టుకుంటారు. ఆ ప్రభావం మన జీవితంపై పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉదయం.. అత్యంత శక్తివంతమైన సమయం. మనం సరైన రీతిలో రోజును ప్రారంభిస్తే...ఆ రోజు మొత్తం ఎంతో ఆనందంగా, హాయిగా ఉంటారు.
26
దేవుడిని స్మరించుకోవడం
మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, మీ మనస్సు చాలా ప్రశాంతంగా, మీ మెదడు చాలా యాక్టివ్‍గా ఉంటుంది. ఆ సమయంలో దేవుడిని తలచుకోవడం వల్ల మనస్సులో ఒక విధమైన స్థిరత్వాన్ని సృష్టిస్తుంది. ఈ చిన్న అలవాటు మీ రోజును అద్భుతంగా మార్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
36
ఆధ్యాత్మిక శక్తి
ఉదయం పూట ఆధ్యాత్మికతను తోడు చేసుకుంటే జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. మీ మనస్సులో ఉద్భవించే మంచి ఆలోచనలు రోజంతా చక్కని మార్గనిర్దేశం చేస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనిషి జీవితం అనేది 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు. తండ్రి, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సూర్యుని అంశం. తల్లి, మానసిక ప్రశాంతతను నియంత్రించే చంద్రుని అంశం. గురువు.. జ్ఞానం, మార్గదర్శకత్వాన్ని సూచించే గురు గ్రహానికి ప్రతినిధి.
56
రోజులో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి?
ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ మూడు నామాలను భక్తిశ్రద్ధలతో జపించాలి. తండ్రి నామాన్ని నాలుగు సార్లు, తల్లి నామాన్ని మూడు సార్లు, గురువు నామాన్ని మూడు సార్లు జపించడం వలన శక్తివంతమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది.
66
జీవితంలో గ్రహాల ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు, చంద్రుడు, గురు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు జీవితంలో సానుకూలత ఉంటుంది. సూర్యుడు బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చంద్రుడు సమతుల్యంగా ఉంటే మనసు స్థిరంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. గురు గ్రహం బలంగా ఉంటే జ్ఞానం, మంచి మార్గదర్శకత్వం లభిస్తాయి.