Venus Moon Conjunction: శుక్ర చంద్రుల కలయికతో ఈ 3 రాశులకు వచ్చే నెల నుంచి డబ్బే డబ్బు,

Published : Mar 25, 2026, 08:55 AM IST

Venus Moon Conjunction: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం, శుక్రుడు చంద్రుడు వచ్చే నెల మేషరాశిలో కలవబోతున్నారు. దీనివల్ల 'వైభవ లక్ష్మీ రాజయోగం' ఏర్పడుతుంది.  ఈ యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన ధనాన్ని, కీర్తిని తెచ్చిపెడుతుంది.

PREV
14
వైభవ లక్ష్మీ రాజయోగం

వేద జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సుఖసంతోషాలకు కారకుడు. ఇక చంద్రుడు మనసుకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. వచ్చే నెల ఈ రెండు గ్రహాలు మేషరాశిలో కలవబోతున్నాయి. మార్చి 26న శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఏప్రిల్ 18న చంద్రుడు మేష రాశిలోకి అడుగుపెడతాడు. ఆరోజు ఈ యోగం ఏర్పుడుతుంది. ఈ యోగం వల్ల మేషం, సింహం, కర్కాటక రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

24
మేష రాశి

మేష రాశి వారు వైభవ లక్ష్మీ రాజయోగం వల్ల ఎంతో లాభ పడతారు. వారికి జీవితంలో ఎన్నో  సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ శుభ యోగం మేష రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీని వల్ల కష్టమైన పనుల్లో కూడా  వీరు విజయం సాధిస్తారు. వీరు ఉద్యోగంలో, వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు పొందుతారు. వీరి కెరీర్‌లో మంచి పురోగతి కనిపిస్తుంది.

34
సింహ రాశి

మేషరాశిలో ఏర్పడే వైభవ లక్ష్మీ రాజయోగం సింహ రాశి వారికి ఎన్నో శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి అన్నిరకాలుగా  అదృష్టం కలిసివస్తుంది. వీరి చేతికి డబ్బు అందుతుంది. అలాగే విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం కూడా ఎక్కువ. ఇక పోటీ పరీక్షలు రాసివన వారు  విజయం సాధించే అవకాశం ఉంది.

44
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి వైభవ లక్ష్మీ రాజయోగం ఎంతో మేలు చేస్తుంది.  ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. ఇక ఉద్యోగం చేసే వారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపారం చేసే వారికి ఒక పెద్ద ఒప్పందం ద్వారా విపరీతంగా ఆర్ధిక లాభాలు పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories