telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఆదాయం:-5
వ్యయం:-5
రాజపూజ్యం:-3
అవమానం:-6
గురుడు 1-5-24 వరకు లాభ స్థానంలో లోహ మూర్తి గా సంచరించి.తదుపరి సంవత్సరమంతా వ్యయ స్థానంలో లోహ మూర్తిగా సంచారం.
శని ఈ సంవత్సరమంతా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం
కేతువు ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం.
ఈ సంచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.శుభ కార్యక్రమాలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో స్థానచలనం.జీవిత భాగస్వామితో అకారణంగా కలహాలు.ఈ సంవత్సరం రాహు సంచారం బాగుంది.భార్య పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యవహారాలలో చిక్కులు ఏర్పడకుండా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.మానసికంగా ఇబ్బంది పడతారు.ఏది ఏమైనా గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు.మీ జీవిత ఆశయాలు నెరవేరుతాయి.బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.అప్రయత్నముగా ధన లాభం పొందగలరు.
మృగశిర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.
శని 3-10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.
రాహువు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం క్షేమ తార లో సంచారం
కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం.
ఆరుద్ర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి పరమ మిత్ర తార లో లో సంచారం.
శని 3-10-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి జన్మతారలో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సంపత్తార లో సంచారం.
రాహు 7-7-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం విపత్తార లో సంచారం.
కేతువు 11-11-24 వరకు మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం నైధనతార లో సంచారం.
Gemini
పునర్వసు నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.
శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.
రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం సంపత్తార లో సంచారం.
కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం
(గురు శని కేతు గ్రహాల సంచారం సామాన్యంగా ఉన్నాయి.కావున ఈ సంవత్సరం ఈ రాశి వారు ప్రతి మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది.)
ఏప్రిల్
బంధుమిత్రులతో ఇచ్చి పుచ్చుకోవడం ఉంటాయి.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆర్థిక లావాదేవీల సంతృప్తికరంగా ఉంటాయి.సంతానం ద్వారా సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు లో అంకితభావంతో వ్యవహరించాలి.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.
మే
కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారం లభిస్తుంది.కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన సంఘటన నుండి బయటపడతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.బందో వర్గంతో మాట పట్టింపులు రాగలవు.ఉద్యోగాలలో అంకితభావం అవసరం.అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది.కుటుంబ వ్యవహారాలు లో తగ్గి ఉండటం మంచిది.
Gemini
జూన్
ఊహించని విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు.ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.మానసికంగా అనేకమైన ఆలోచనలతో మన స్థిమితం ఉండదు.ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.శుభకార్యము మూలకంగా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.రుణాలు చేయవలసి వస్తుంది.వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లిన లోలోపల భయాందోళన పెరుగుతుంది.కుటుంబంలో కలహాలు ఏర్పడి చికాకుగా ఉంటుంది.సంతానమునకు ఆరోగ్య సమస్యలు ఎదురవగలవు.వ్యక్తిగతమైన ప్రయోజనం పొందగలరు.
జూలై
చిన్నపాటి ఇబ్బందులు.ఉద్యోగాలలో లో ఒత్తిడి అధిక శ్రమ పెరుగుతుంది.అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది.ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంత లభిస్తుంది.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.ధైర్యంతో పట్టుదలతో చేసిన పనులు లో విజయం సాధిస్తారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం పొందుతారు.స్త్రీ మూలక సహాయం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా మలుచుకుంటారు. కుటుంబంలో వివాహ సందడి ఆనంద ఆహ్లాదకరంగా ఉంటుంది.
Gemini
ఆగస్టు
తలపెట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారులచే ప్రయోజనం పొందగలరు.అనుకోని ప్రయాణం చేయవలసి ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.సంతోషకరమైన వార్త వింటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.భార్య భర్తలు ప్రతి విషయాన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సెప్టెంబర్
ఇంటా బయట కలహ వాతావరణం.వాహనం గాని యంత్రాలు తో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.దైవదర్శనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.నూతన పరిచయాలు లాభిస్తాయి.ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.ఖర్చులను నియంత్రించుకోవాలి.వ్యాపారంలో పోటీ తత్వమునకు దూరంగా ఉండాలి.
అక్టోబర్
వృత్తి ఉద్యోగాల్లో ఆసక్తి లేకపోవడం చేత అకారణంగా వివాదానికి గురి కావాల్సి ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు కొన్ని పొరపాట్లు జరుగుతాయి.వ్యవహార విషయాల్లో ఉద్రేకం కోపావేశము తగ్గించుకొని వ్యవహరించడం మంచిది.అనుకోని దుస్సంఘటన లు ఎదురవుతాయి.మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ కొద్దిపాటి రుణాలు చేయవలసి వస్తుంది.అనవసరమైన ఖర్చులను తగ్గించడం మంచిది.జీవన విధానం సాఫీగా సాగుతుంది.సేవకా జనాలు తో ఒత్తిడికి గురి అవుతారు.అవసరం లేని వ్యవహారాల్లో ప్రాధాన్యం ఇస్తారు.
నవంబర్
అత్యాశకు పోయి కొత్త సమస్యలు ను కొని తెచ్చుకుంటారు.జీవిత భాగస్వామి తో అంతః కలహాలు రాగలరు.అన్ని విధాల అన్ని రంగాల వారికి అనుకూలం.చేసే వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఆరోగ్యం అనుకూలం గా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు.వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు.వాహన సౌఖ్యం లభిస్తుంది.సంతానంతో సఖ్యత మరియు అభివృద్ధి కలుగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంతాన సంబంధిత వ్యవహారాల్లో అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగాలు లో ఒత్తిడి అధికంగా ఉంటుంది.
Gemini
డిసెంబర్
ఈ నెలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరక గాయాలు ప్రమాదాలు జరిగే అవకాశం.ఇతరులతో మాట పట్టింపులు రాగలవు.గృహ మార్పులు జరుగును. మాసాంతంలో పరిస్థితులు చక్కబడి ఆనందంగా గడుపుతారు.సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది.సమాజంలో గౌరవ మర్యాదలు కు లోటుండదు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.భాగస్వానికంగా చేయు వ్యాపారాలు లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులు చే సహకారములు ఏర్పరచుకుంటారు.అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారుట జరుగును.
జనవరి
వృత్తి వ్యాపారాలు లో రాణింపు ఉంటుంది.ఆరోగ్యం విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.అవసరానికి సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది.ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. దూరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.వ్యవహారాల్లో మౌనంగా పాటించడం మంచిది.మానసికంగా ఒత్తిడి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటాయి.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు.ఆదాయం మరియు ఖర్చు తరచూ చూసుకోవాలి. విద్యార్థులు లక్ష్యాన్ని సాధన విధానం తో ముందుకు సాగాలి.
Gemini
ఫిబ్రవరి
అన్ని రంగములలో విజయం సాధిస్తారు.గృహంలో వివాహాది శుభకార్యములు జరుగును.సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు.ప్రతి పనిలో పట్టుదల అవసరం.మధ్యవర్తిత్వం లకు పెద్దమనిషి తరహా పాత్రలకు దూరంగా ఉండాలి.ఆర్థిక వ్యవహారాలలో సర్దుకుపోవడం మంచిది. అధికారులు తో మరియు సహోద్యోగులతో జాగ్రత్తలు తీసుకోవాలి,
Gemini
మార్చి
వృత్తి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి.స్థిరాస్తి అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తారు. అనేక మార్గాల ద్వారా ధన లాభాలు పొందగలరు.ఆరోగ్యం అనుకూలించును.కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది.తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కాగలవు.వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువులపై విజయం సాధిస్తారు.సంఘంలో నూతన ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.పనిలో ఆసక్తి పెరిగి తలపెట్టిన పనులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. అవసరములను సమర్ధించుకునే రీతిలో ఆదాయ మార్గాలు లభిస్తాయి. మధ్యవర్తిత్వం లకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి ఇందులో వినోదాల్లో పాల్గొంటారు.
జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)