Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు

First Published | Apr 2, 2024, 4:02 PM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు వృషభ రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఆదాయం:-2
వ్యయం:-8
రాజపూజ్యం:-7
అవమానం:-3

గురుడు 1-5-24 వరకు వ్యయ స్థానంలో సువర్ణ మూర్తిగా సంచరించి.తదుపరి సంవత్సరాంతం జన్మరాశిలో రజత మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత బంధువర్గంతో విరోధాలు కుటుంబము లో చికాకులు కలుగును.

శని ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో తామ్ర మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత సమాజంలో అపవాదము. గౌరవ మర్యాదలు తగ్గును.

రాహువు  ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో సువర్ణ మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత మీ ఆశయాలు సిద్ధిస్తాయి.

కేతువు ఈ సంవత్సరమంతా పంచమ స్థానంలో స్వర్ణ మూర్తిగా సంచారం.ఈ సంచారం చేత మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.


వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు పొందగలరు. ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు. గత కొద్ది కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడతారు.మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేరుతాయి.ఈ సంవత్సరం జీవితంలో ఎదగవలసిన సంవత్సరంగా చెప్పవచ్చు.అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.అన్ని విధాల అభివృద్ధి చెందుతారు.స్థలాలు గాని ఇల్లు గాని కొనాలని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారంతో కలిగిన స్థాన మార్పులు రాగలవు.అనారోగ్య సమస్యలు.ఉమ్మడి స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరక పటుత్వం తగ్గుతుంది.వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది.గృహంలో శుభకార్యాలు జరుగును.ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది.కొన్ని విషయాల్లో అపవాదము అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.విదేశీ ప్రయాణం ప్రయత్నాలు అనుకూలిస్తాయి.



కృత్తిక నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి  విపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం సాధన తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు సంపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం.

రోహిణి నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు జన్మ తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి సంపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు క్షేమ తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు క్షేమ తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  ప్రత్యక్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు జన్మతారలో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం పరమ మిత్ర తార లో సంచారం.

మృగశిర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.

శని -10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  క్షేమ తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం

(ఈ సంవత్సరం ఈ రాశి వారు ప్రతి మాస శివరాత్రి కి రుద్రాభిషేకం అలాగే సంకటహర చతుర్థి రోజు గణపతి ఆరాధన చేయడం మంచిది.)


ఏప్రిల్

మధ్యలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.మానసికంగా శారీరకంగా బలపడతారు. నూతన వస్తు ఆభరణాలను వాహనాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.
 


మే
ప్రయత్న కార్యాలు అనుకూలిస్తాయి.రావలసిన బాకీలు చేతికందుతాయి. అన్నదమ్ముల తోటి విరోధాలు పోయి మైత్రి భావంతో ఉంటారు.వ్యవహారాల్లో ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి.వివాహాలు శుభకార్య ప్రయత్నాలు పట్టుదలతో పూర్తి కాగలవు.నూతన వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనేక మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది.వ్యాపారాల్లో పెట్టుబడులు విషయాలు అనుకూలం.ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి కాగలవు.

జూన్
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తలపెట్టిన కార్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.విద్యార్థులు కష్టపడి చదివిన మంచి ఫలితాలు సాధిస్తారు.కుటుంబంలో అనారోగ్య సమస్యలు చికాకులు అధికమవుతాయి.సమాజంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.ప్రతి విషయంలో ఆలోచించి వ్యవహరించాలి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి.

జూలై
దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.వ్యవహారాల్లో సమయాన సందర్భంగా వ్యవహరించాలి. విద్యార్థులకు మంచి కళాశాల ప్రవేశాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వాహన యంత్రాలు  కొనుగోలు చేస్తారు.వివాహాది ప్రయత్నాలలో‌ ఆటంకాలు ఏర్పడతాయి.గృహ సంబంధమైన కార్యాలు అనుకూలిస్తాయి.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.కొద్దిపాటి మానసిక ఆందోళన కలుగును.వ్యాపార లాభాలు పెరుగుతాయి.రాజకీయ నాయకులు మంచి గుర్తింపు పొందగలరు.

ఆగష్టు
సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.ఆరోగ్య విషయాలు అనుకూలం.చేసే పనులలో శ్రమాదికంగా ఉంటుంది. ప్రయత్నం కార్యాలలో ఆటంకాలు ఏర్పడిన ఆలస్యంగా పూర్తి కాగలవు.ఉద్యోగాలలో అంకిత భావంతో వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు చదువుల్లో పట్టుదల చూపాలి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ఉద్యోగాలు లో అధికార వృద్ధి కలుగును. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
 

సెప్టెంబర్
సంతానానికి ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది.వివాహ శుభ కార్యాలు జరుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.సమస్య ఏర్పడిన వెంటనే పరిష్కారం కూడా లభిస్తుంది.స్థిరాస్తి మరియు పెట్టుబడి విషయాల్లో ఆలోచించి వ్యవహరించాలి. సమాజంలో మీ మాటలు ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తాయి.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.విద్యార్థులు నూతన విద్యలో బాగా రాణిస్తారు.పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


అక్టోబర్
ఉద్యోగాలలో అధికార ప్రమోషన్లు పొందగలరు.గత సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈనెల పరిష్కార మగును.భూ గృహ నిర్మాణం పనులు కు అనుకూలం. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కడుగుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు వాహనాలు విలువైన వస్తువులు కొంటారు.సంతానం ద్వారా సౌఖ్యం లభిస్తుంది.భార్య భర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడి సుఖమైన జీవితం పొందుతారు.

నవంబర్

సమయం కానీ సమయంలో భోజనం చేయాల్సి వస్తుంది.వివాదములు వలన చికాకులు అధికమవుతాయి.ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతారు. బంధుమిత్రుల లో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు.గృహ నిర్మాణ పనులు చేపడతారు. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. చర స్థిరాస్తి విషయంలో విభేదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం కాగలవు. తీర్థయాత్రలు చేసే ఆలోచనలు ఫలిస్తాయి.వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
 

డిసెంబర్

ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.మానసిక ప్రశాంతత తగ్గి వ్యవహారాల్లో ఇబ్బందులకు గురవుతారు.తొందరపాటు లేదా ఆవేశ నిర్ణయాలకు దూరంగా ఉండాలి.ఇతరుల మీద ఈర్ష్య భావములు పెరుగుతాయి.అభివృద్ధి కార్యక్రమాల్లో పట్టుదల చూపించాలి.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది.ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి.చేసే పనులు లో అలసత్వం పెరుగుతుంది.పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచి పోగలవు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు.

జనవరి
వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.ఖర్చు లకు సరిపడా ఆదాయం లభిస్తుంది.చేసే పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది.యంత్రాలతో జాగ్రత్తలు తీసుకోవాలి.దూరపు ప్రయాణం చేయాల్సి వస్తుంది.బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందంగా ఉంటారు.విందులు వినోదాల్లో పాల్గొంటారు.వస్తు ఆభరణాలను వాహనాలు ఏర్పరచుకుంటారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులు నూతన అభివృద్ధి ప్రణాళికలు రచిస్తారు.రాజకీయ నాయకులు మంచి గుర్తింపు లభిస్తుంది.


ఫిబ్రవరి

వ్యవహారాల్లో అంతంత మాత్రంగానే ప్రయోజనం ఉంటుంది.కుటుంబంలో అభిప్రాయాలు బేధాలు ఏర్పడి ఎవరు తీరు వారిదిగా ఉంటుంది.ఉద్యోగాలలో అంకిత భావంతో వ్యవహరించాలి.బంధుమిత్రులతో లేదా సమాజంలో లౌక్యంగా మాట్లాడాలి.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్ధించు కొను ఆదాయం లభిస్తుంది. మీరంటే వ్యతిరేకించే వ్యక్తులతో ఇబ్బందులు రాగలవు.కోర్టు వ్యవహారాలు అనుకూలం.సమాజంలో ఉన్నతమైన లేదా పెద్దవారు తో  పరిచయాలు ఏర్పడతాయి.అన్న వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది.
 

మార్చి
ఈనెల అనుకూలమైన ఫలితాలు పొందగలరు.వ్యవహారాల్లో పట్టుదల చూపి అనుకున్నది సాధిస్తారు.నూతన వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.గత కొంతకాలంగా ఏర్పడిన అనారోగ్య సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది.సాహసోపేతమైన కార్యాలకు దూరంగా ఉండాలి.వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు చేస్తారు.కొన్ని విషయాలు లో మధ్య వ్రతత్వం వహించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.భూ గృహ నిర్మాణం క్రయ విక్రయాలు చేస్తారు.గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగి ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు.

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

Latest Videos

click me!