Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశిలో జన్మించిన వారు ఒక్కోలా ఉంటారు. కొందరు అందరికి నచ్చేలా ఉండాలనుకుంటే, మరికొందరు తమకు నచ్చిందే చేయాలి అనుకుంటారు. అలా కొన్ని రాశుల్లో పుట్టిన అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరట. ఆ రాశులేవో చూద్దాం.
కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోవడం చాలా ముఖ్యం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులలో పుట్టిన పురుషులు పుట్టుకతోనే స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి సొంత ఆలోచనలు, మొండి పట్టుదల ఎక్కువగా ఉంటాయి. భార్య చెప్పిన మాటను అంగీకరించకుండా, తమ సొంత నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి రాశుల అబ్బాయిల గురించి, వారి వైవాహిక జీవితం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
మేష రాశి
కుజుడి ఆధిపత్యంలో ఉండే మేష రాశి పురుషులకు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, అధికార స్వభావం ఎక్కువగా ఉంటాయి. పెళ్లి తర్వాత కూడా, తమ స్వేచ్ఛలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని లేదా తమను కంట్రోల్ చేయడాన్ని వీరు అస్సలు ఇష్టపడరు. భార్య ప్రేమకు, గౌరవానికి విలువ ఇస్తారు కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మాత్రం తమ చేతుల్లోనే ఉంచుకోవాలని అనుకుంటారు. ఏ విషయంలో అయినా వారి మాటే ఫైనల్ చేస్తారు.
36
సింహ రాశి
సూర్యుడు అధిపతిగా ఉండే సింహ రాశి అబ్బాయిలు తమ ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంలో తమ మాటకు విలువ ఉండాలని, ముఖ్యమైన విషయాల్లో తమ నిర్ణయమే ప్రధానంగా ఉండాలని వీరు కోరుకుంటారు. కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునే స్వభావం ఉన్నప్పటికీ, భార్య నియంత్రణలో ఉండటాన్ని మాత్రం వీరు ఇష్టపడరు. భార్యకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత, ప్రేమను అందించడంలో వీరు ముందుంటారు. అదే సమయంలో భార్య తనను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం వారి గంభీరమైన మనసు దాన్ని అంగీకరించదు.
గురు గ్రహం అనుగ్రహం పొందిన ధనుస్సు రాశి అబ్బాయిలు.. కొన్ని కచ్చితమైన సిద్ధాంతాలు, స్వేచ్ఛా భావాలు కలిగి ఉంటారు. వీరు ఎవరి కంట్రోల్‌లోనూ అంత సులభంగా ఉండరు. పెళ్లి తర్వాత కూడా తమకు నచ్చినట్టు జీవించాలని అనుకుంటారు. భార్య ఎంత బలవంతం చేసినా తమ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోరు.
56
కుంభ రాశి
శని గ్రహం ఆధిపత్యంలో ఉండే కుంభ రాశి పురుషుల ఆలోచనా విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అందరితో కలివిడిగా ఉన్నా, తమ మనసుకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తారు. భార్య అభిప్రాయాలను వింటారు కానీ, తమ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో మాత్రం భార్య అధికారాన్ని అస్సలు అనుమతించరు.
66
పండితుల సూచనలు
జ్యోతిష్య పండితుల ప్రకారం అధికారం చెలాయించే భర్తలపై కోపం చూపించకుండా, ప్రేమతో, తెలివైన మాటలతో పనులు చక్కబెట్టుకుంటే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అలాగే మంగళవారం నాడు భార్యాభర్తలు కలిసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే, మొండి పట్టుదల తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుంటారని పండితులు చెబుతున్నారు.