మీ ఇంట్లో ఎన్ని బర్నర్ల స్టవ్ ఉన్నప్పటికీ, అగ్నిదేవుడి అనుగ్రహం లభించి లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే ఈ క్రింది నియమాలను తప్పకుండా పాటించాలి:
సరైన దిశ (ఆగ్నేయం): గ్యాస్ స్టవ్‌ను ఎల్లప్పుడూ వంటగదిలోని ఆగ్నేయ మూల (East-South) లోనే ఉంచాలి. ఇది అగ్ని తత్వానికి సంబంధించిన దిశ కాబట్టి ఇక్కడ స్టవ్ ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తూర్పు ముఖంగా వంట చేయాలి: వంట చేసేటప్పుడు గృహిణి లేదా వంట చేసే వ్యక్తి ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు ఉండాలి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ఇంట్లో ప్రశాంతతను నింపుతుంది.
ఈశాన్యంలో పొయ్యి అస్సలు వద్దు: వంటగదిలోని ఈశాన్య దిశ (North-East) జల తత్వానికి నిలయం. కాబట్టి ఈ పవిత్రమైన స్థలంలో గ్యాస్ స్టవ్ ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు, ఆర్థిక నష్టాలు , కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.
సింక్ , స్టవ్ పక్కపక్కనే ఉండకూడదు: నీరు, నిప్పు విరుద్ధ స్వభావం కలిగినవి. అందుకే వాష్ సింక్ , గ్యాస్ స్టవ్ పక్కపక్కనే లేకుండా వాటి మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. లేదంటే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.
మీ ఇంట్లో 3 బర్నర్ల స్టవ్ ఉంటే అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. బర్నర్ల సంఖ్య ముఖ్యం కాదు, దానిని సరైన దిశలో అమర్చుకోవడం , సరైన పద్ధతిలో వంట చేయడం మాత్రమే ముఖ్యం.