మన నక్షత్రాలు, రాశీ చక్రం ప్రకారం.. మన స్వభావాన్ని అంచనా వేయొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రతి రాశి, నక్షత్రానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి.అయినప్పటికీ కొంతమంది తమ రాశిప్రకారం.. స్వార్థపరులుగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. స్వార్థపరులుగా ఉండే 4 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మేషం
మేష రాశి
మేష రాశి వారు చాలా ధైర్యవంతులు. అలగే గట్టి సంకల్పం ఉన్నవారు. వీరు స్వభావారీత్యా నాయకులుగా ఉంటారు. కానీ వీరి నాయకత్వ లక్షణాల వల్ల వీరు స్వార్థంగా ఉంటారు.
మేష రాశి వాళ్లు తమ లక్ష్యాలను సాధించడానికి, తమ కోరికలను నెరవేర్చడానికి వేరేవారి గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రాశి వాళ్లు ప్రతిదానిలోనూ విజయం సాధించాలనుకుంటారు. వీరికున్న పోటీతత్వ లక్షణం వీరిని స్వార్థపరులుగా మారుస్తుంది.
సింహ రాశి
సింహం:
సింహ రాశి వారికి మంచి నాయకులుగా ఉంటారు. వీరికున్న నాయకత్వ లక్షణాలు జనాలను బాగా ఆకర్షింస్తాయి. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగ ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికున్న మంచి వ్యక్తిత్వంతో సంఘంలో వీరి విలువను పెంచుతుంది. కానీ ఈ వ్యక్తిత్వం కొన్ని కొన్ని సార్లు స్వార్థ పరులుగా చేస్తుంది.
సింహరాశివారు ఇతర రాశుల వారికంటే ఎక్కువ కోరికలు, అవసరాలు ఉంటాయి. వీళ్లు ఎప్పుడూ ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఇదే కొన్ని కొన్ని సార్లు ఇతరుల అవసరాలను మర్చిపోయేలా చేస్తుంది. అందుకే చాలా సార్లు సింహరాశివారు స్వార్థపరులుగా ప్రవర్తిస్తారు.
చిత్రం: Pexels
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు విపరీతంగా ఆలోచనలు చేస్తారు. అలాగే వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ప్రతిదీ తమ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు. ఇతర రాశులకంటే వీరు స్వంత భావోద్వేగాలు , కోరికలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు.
కానీ ఇది కొన్నిసార్లు అసూయకు దారితీస్తుంది. అలాగే వీళ్లను మరింత సెల్ఫిష్ గా చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ తమ స్వంత భావోద్వేగాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇతరుల గురించి పట్టించుకోరు. కానీ కొన్ని సార్లు వృశ్చిక రాశి వారు కూడా కొన్నిసార్లు స్వార్థపరులుగా ఉంటారు.
మకరం
మకర రాశి
మకర రాశి వారు తమ లక్ష్యాలు, దృఢ నిశ్చయానికి పేరుగాంచారు. ఈ రాశివారు బాగా కష్టపడి పనిచేస్తారు. అలాగే విజయం సాధించడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తారు. కానీ వీళ్లు తమ వృత్తి, వ్యక్తిగత లక్ష్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశివారు మంచి విజేతలుగా పేరుగాంచారు. కానీ వీళ్లు కొన్ని సార్లు స్వార్తపూరితంగా వ్యవహరిస్తారు.
మకర రాశి వారు విజయం సాధించడం కోసం కొన్ని కొన్ని సార్లు తమ సంబంధాలు, వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తారు. ప్రియమైనవారి కోసం సమయాన్ని వెచ్చించలేరు. మకర రాశి వారు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడంలో చాలా వెనకబడతారు.