May Horoscope 2026: 12 రాశుల్లో మే నెల ఏ రాశివారికి అనుకూలంగా ఉందో తెలుసా?

Published : May 01, 2026, 12:52 PM IST

May Horoscope 2026: ఈ మాస ఫలాలు మే నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మే నెలలో మేష రాశి వారికి ఉత్సాహం, కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఈ నెల ఫలప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు.

313
వృషభ రాశి ఫలాలు

మే నెలలో వృషభ రాశి వారికి స్థిరత్వం, ప్రగతి ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో నెమ్మదిగా విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రశంసలు, ప్రమోషన్ లు దక్కుతాయి. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు పొందవచ్చు.

413
మిథున రాశి ఫలాలు

మే నెలలో మిథున రాశి వారికి మార్పులు, కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు రావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ప్రధాన బలమవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులు తగ్గించాలి. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందకరమైన క్షణాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ నెలలో మంచి అవకాశాలు ఉంటాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

మే నెలలో కర్కాటక రాశి వారిని భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎంత కష్టపడినా ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త అవకాశాలు వస్తాయి. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ నెల సహనం, పట్టుదలతో ముందుకు సాగాల్సిన సమయం.

613
సింహ రాశి ఫలాలు

మే నెలలో సింహ రాశి వారికి శక్తి, ధైర్యం పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశముంది. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. చదువులో పురోగతి ఉంటుంది. 

713
కన్య రాశి ఫలాలు

మే నెల కన్య రాశి వారికి క్రమశిక్షణ, ప్రణాళికతో ముందుకు వెళ్లే సమయం. మీరు చేసే పనుల్లో స్పష్టత ఉంటుంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి పెరగవచ్చు. వ్యాపారాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు వచ్చినా, తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

813
తుల రాశి ఫలాలు

మే నెల తుల రాశి వారి సహనానికి పరీక్ష పెడుతుంది. పనిలో ఒత్తిడి పెరిగినా, మీరు దాన్ని శాంతంగా, తెలివిగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు, ఇవి మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒప్పందాలపై స్పష్టత అవసరం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు.

913
వృశ్చిక రాశి ఫలాలు

మే నెలలో వృశ్చిక రాశి వారికి మార్పులు, అవకాశాలు రెండూ కలిసి వస్తాయి. మీరు చేసే పనుల్లో లోతైన ఆలోచన, పట్టుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మద్ధతు ఉంటుంది, కానీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రేమ జీవితంలో చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

మే నెలలో ధనుస్సు రాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. కానీ పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. సంబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు

మే నెలలో మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా శాలరీ పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో స్థిరమైన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. మీ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు

మే నెలలో కుంభ రాశి వారికి కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. కొత్త మార్గాలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. టెక్నాలజీ లేదా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ ఆలోచనలకు మద్ధతు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు ఇది మంచి సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి పెరుగుతుంది.

1313
మీన రాశి ఫలాలు

మే నెలలో మీన రాశి వారికి భావోద్వేగాలు, సృజనాత్మకత పెరుగుతాయి. కళాత్మక పనుల్లో మంచి ప్రతిభ చూపిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో సృజనాత్మక ఆలోచనలతో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. మానసిక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories