Rahu and Kuja: రాహువు కుజుడి వల్ల అంగారక యోగం.. ఈ 3 రాశుల వారికి అష్ట కష్టాలు తప్పకపోవచ్చు

Published : Jul 02, 2026, 10:31 AM IST

Rahu and Kuja: రాహువు, కుజుడు కలయిక అంగారక యోగాన్ని సృష్టిస్తుంది. రాహువు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించింది. ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. దీనివల్ల అక్కడ అంగారక యోగం ఏర్పడింది. మూడు రాశుల వారు ఈ యోగం వల్ల కష్టాలు పడొచ్చు. 

PREV
13
మేష రాశి

అంగారక యోగం అనేది మేషరాశికి అచ్చిరాదు. మేష రాశికి అధిపతి కుజుడు. అంగారక యోగం వల్ల మేష రాశి వారు జులై నెల మొత్తం తమ మాట తీరును అదుపులో ఉంచుకోవాలి. మాట అదుపులో లేకపోతే కుటుంబానికి, చేసే ఉద్యోగానికి, వ్యాపారానికి కూడా హాని తెచ్చుకున్న వారు అవుతారు.

23
కర్కాటక రాశి

జూలై నెలలో కర్కాటక రాశి వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది. దీనికి కారణం రాహు కుజుల వల్ల ఏర్పడిన అంగారక యోగమే. ఇది వారిలో భవిష్యత్తుపై భయాన్ని కూడా పెంచేస్తుంది. ఇక వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

33
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. అతడు రాహువుతో కలిసి అంగారక యోగం ఏర్పరచడం వల్ల వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కోపం విపరీతంగా పెరుగుతుంది. వీరు చాలా దూకుడుగా ఉంటారు. ఈ రాశివారు జూలై నెల మొత్తం సహనంతో, ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories