Mars Transit: పూర్వాషాడ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్న కుజుడు, ఈ 3 రాశులకు బంగారు కాలం

Published : Nov 13, 2025, 10:19 AM IST

Mars Transit: ధైర్య సాహసాలకు కారకుడు కుజుడు. కుజుడి సంచారం ఎన్నో రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కుజుడు ఈ ఏడాది చివర్లో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఈ మార్పు 3 రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. 

PREV
14
కుజుడి సంచారం

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు డిసెంబర్ 25, 2025 గురువారం పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. పూర్వాషాఢ అనేది శుక్రుడికి చెందిన నక్షత్రం. డిసెంబర్ 25న మధ్యాహ్నం 12.24 గంటలకు కుజుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు తన నక్షత్రాన్ని మార్చుకోవడం వల్ల 12 రాశులపై అధికం ప్రభావం కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా 3 రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

24
మేష రాశి

మేష రాశి వారికి కుజుడి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.  కుజుడి పూర్వాషాడ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్త్యేని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. వీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రేమ విషయంలో కూడా వీరువిజయం సాధిస్తారు. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మేషరాశి వారు  ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.  వ్యాపారం చేస్తున్నవారికి వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కలుగుతాయి.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 

34
తులా రాశి

కుజుడి మార్పు వల్ల తులారాశి వారికి మంచి విజయాలు దక్కుతాయి.  కొత్త ఉద్యోగం కోసం మీ వెతుకులాట పెరుగుతుంది. మీరు కచ్చితంగా శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది.  ప్రభుత్వ ఉద్యోగకోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినిపిస్తుంది.  వ్యాపార ప్రయాణాలు సక్సెస్ అవుతాయి.

44
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కుజ సంచారం ఎంతో మేలు జరుగుతుంది. మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ఫిట్‌నెస్‌పై  శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు. ప్రేమ జీవితంలోని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories