Mars Transit: జూన్ 7 నుంచి ఈ నాలుగు రాశులకు కష్టాలు తప్పవు, జాగ్రత్తగా ఉండాల్సిందే

Published : May 29, 2025, 03:02 PM IST

మంగళ గ్రహం జూన్ 7వ తేదీన కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి అడుగుపెడుతుంది. ఈ మార్పు నాలుగు రాశులవారికి లేని పోని కష్టాలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఆ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

PREV
15
జూన్ లో ఎలా ఉండనుందంటే..

ప్రస్తుతం మంగళ గ్రహం  కర్కాటక రాశిలో ఉంది. ఈ గ్రహం జూన్ 7వ తేదీన సింహ రాశిలోకి అడుగుపెట్టనుంది. ఈ మార్పు అన్ని రాశుల వారిపై శుభ ఫలితాలను అందిస్తుది. కానీ..  నాలుగు రాశుల వారికి మాత్రం చెడు ప్రభావం చూపించనుంది. ఆ నాలుగు రాశుల వారు మాత్రం జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మరి, ఆ రాశులేంటో చూద్దాం…

25
వృషభ రాశి..

ఈ రాశి వారిపై మంగళ రాశి మార్పు చెడు ప్రభావం చూపుతుంది. చేతిలో ఉన్న పనులు ఆగిపోవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో నష్టాలు రావచ్చు. ఆరోగ్యం పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. పాత వ్యాధులు బాధిస్తాయి. ఉద్యోగంలో అధికారుల వేధింపులు ఉంటాయి. మాటలపై నియంత్రణ అవసరం.

35
కన్య రాశి..

ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు రావచ్చు. పిల్లల గురించి ఆందోళన పెరుగుతుంది. గౌరవ మర్యాదలు తగ్గవచ్చు. ప్రేమ జీవితం సరిగ్గా ఉండదు. ప్రేమికుల మధ్య విభేదాలు జరగవచ్చు, ఊహించని ఖర్చులు రావచ్చు.

45
వృశ్చిక రాశి

ఈ రాశి వారు చట్టపరమైన సమస్యలకు దూరంగా ఉండాలి. లేదంటే పెద్ద ఇబ్బందుల్లో పడతారు. చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒక్కసారిగా ఎవరికైనా అనారోగ్యం రావచ్చు. డబ్బు కొరత ఏర్పడుతుంది. బడ్జెట్ అదుపు తప్పుతుంది.

55
మీన రాశి..

ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ఒక్కసారిగా మార్పులు రావచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్లే అవకాశం ఉంది. రక్త సంబంధిత వ్యాధులు రావచ్చు. ఉద్యోగంలో ఇష్టం లేకున్నా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో పరిస్థితి మరింత దిగజారవచ్చు. రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఎవరికీ అప్పు ఇవ్వకండి.


Disclaimer
ఈ వ్యాసంలోని సమాచారం జ్యోతిష్యుల అభిప్రాయాలు. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ఒక మాధ్యమం మాత్రమే. దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Read more Photos on
click me!

Recommended Stories