Mars Transit:మరో నాలుగు రోజుల్లో కుజుడు నక్షత్ర మార్పు... ఈ రాశులకు మహర్దశ మొదలైనట్లే

Published : Oct 09, 2025, 05:12 PM IST

Mars Transit: గ్రహాల అధిపతి అయిన కుజుడు మరో నాలుగు రోజుల్లో విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నక్షత్ర మార్పు మూడు రాశులకు అనేక ప్రయోజనాలను కలిగించనుంది. ఏ పని చేపట్టినా వారు విజయం సాధించగలరు. 

PREV
14
కుజుడు నక్షత్ర మార్పు..

గ్రహాలు తరచూ తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూనే ఉంటాయి. రెగ్యులర్ గా ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశిలోకి, నక్షత్రలోకి మారుతూనే ఉంటాయి. త్వరలో కుజ గ్రహం నక్షత్ర మార్పు చేయనుంది. ఈ కుజ గ్రహాన్ని ధైర్యం, బలం, ధైర్యం, శక్తి, భూమి, వాహనాలు వంటి వాటికి అధిపతి గా పరిగణిస్తారు. ఈ కుజ గ్రహం ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో ఉండగా, అక్టోబర్ 13వ తేదీన గురు గ్రహానికి చెందిన విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మార్పు... కొన్ని రాశులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

24
మేష రాశి....

కుజుడు మేష రాశికి అధిపతి. కాబట్టి, ఈ నక్షత్ర మార్పు...మేష రాశి వారి పై ప్రత్యక్షంగా ప్రభావం చూపించనుంది. ఈ సమయంలో మేష రాశి వారి ధైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. అందులో విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది. భూమి, వాహనం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

34
సింహ రాశి...

సింహ రాశి వారికి, ఈ సంచారం అదృష్టం గా మారుతుంది. విశాఖ నక్షత్రంలో కుజుడు సంచారం సింహ రాశి వారి కెరీర్ కి ఎంతగానో సహాయపడుతుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. గౌరవం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వారికి ఇంకా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా బాగా కలిసొస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో చాలా సంతోషంగా గడపగలరు.

44
ధనస్సు రాశి...

కుజుడు నక్షత్ర మార్పు.. ధనస్సు రాశి వారికి చాలా మేలు చేయనుంది. ఊహించని ప్రయోజనాలు అందిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, తీర్థ యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి. జీవితం ఆనందం గా సాగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories