Mars Transit: సింహ రాశిలోకి ప్రవేశించిన కుజుడు.. ఈ 4 రాశులకు శని కేతువుల వల్ల పండగే

Published : Nov 15, 2026, 09:37 AM IST

Mars Transit: నవంబర్ 12న కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. దీని వల్ల వచ్చే అయిదు నెలల కాలం శని, కేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా 4 రాశుల వారిపై ఈ ప్రభావం ఎక్కువ. వారికి వృత్తి, ఆర్థిక పరంగా ఊహించని లాభాలు కలగనున్నాయి.

PREV
14
మిథున రాశి

మిథున రాశి వారికి కుజుడి సంచారం ఎన్నో శుభ ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల్లో నష్టాలు ఎదుర్కొంటున్న వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనిపిస్తుంది, ఈ రాశి వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.

24
తులా రాశి

తులా రాశి వారికి మంచి రోజుల మొదలయ్యాయి. వీరు పని చేసే చోట విజయం దక్కుతుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. కుజుడి ప్రభావంతో తులా రాశి వారి కష్టానికి సానుకూల ఫలితాలు వస్తాయి. స్నేహితులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

34
వృశ్చిక రాశి

ఈ రాశి వారిలో కొత్త వ్యాపారం మొదలుపెట్టేవారికి, వ్యాపారాన్ని విస్తరించేవారికి ఇది మంచి అనుకూల సమయం. ఇక కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వారు సక్సెస్ అవుతారు. తులా రాశికి చెందిన వారు ఉద్యోగం మారడానికి కూడా ఇది సరైన సమయం. ఆస్తి లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

44
మీన రాశి

మీన రాశి వారి కెరీర్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఎన్నో రోజులుగా పెండింగ్ పడిన పనులు కూడా పూర్తి అవుతాయి. దీని వల్ల ప్రశాంతంగా ఉంటారు. సంపద మీనరాశి వారిని వెతుక్కుంటూ వస్తుంది. వీరు ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు తగ్గి, ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories