తెలుగు సంస్కృతిలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాల టైంలో చాలామంది తినడం, తాగడం కూడా మానేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో 15 రోజుల్లోనే 2 గ్రహణాలు సంభవించనున్నాయి. మరి భారత్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
ఈ మార్చిలో ప్రపంచం ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడనుంది. 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటిది చంద్రగ్రహణం, రెండోది సూర్యగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు చాలా ముఖ్యమైనవి. మరి ఏ తేదీల్లో గ్రహణాలు వస్తున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
25
చంద్రగ్రహణం ఎప్పుడు?
ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14 హోలీ రోజున రానుంది. ఇది ఉదయం 9:29 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3.29 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలో కొన్ని చోట్ల కనిపిస్తుంది.
35
సూర్యగ్రహణం ఎప్పుడు?
మొదటి సూర్యగ్రహణం మార్చి 29, చైత్ర అమావాస్య రోజున వస్తుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటలకు మొదలవుతుంది. ఈ సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. ఆస్ట్రేలియా, ఆసియా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.
45
గ్రహణాల ప్రభావం?
సాధారణంగా గ్రహణ సమయంలో హిందువులు సూతక నియమాలు పాటిస్తుంటారు. కొన్ని పనులు చేయకూడదని నమ్ముతారు. అయితే ఈ రెండు గ్రహణాలు మనకు కనిపించవు. కాబట్టి ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు.
55
మార్చిలో సంభవించనున్న రెండూ గ్రహణాలు భారత్ లో కనిపించకపోయినా ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం ఎదురు చూస్తోంది. శాస్త్రవేత్తల పరిశోధనలకు, అంతరిక్షం గురించి మరింత తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.