మేష రాశి...
కుజ గ్రహం రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం చేసేవారికి జీతం పెరగడం, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ విజయాలు అందుకుంటారు.