Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది

Published : Nov 02, 2026, 12:03 PM IST

Mahalakshmi Rajayogam: నవంబర్ నెలలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. నవంబర్ మొదటి వారంలో కర్కాటక రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో, అక్కడ అప్పటికే ఉన్న కుజుడితో కలుస్తాడు. దీనివల్ల 3 రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా కలిసివస్తుంది.

PREV
13
కన్యా రాశి

కన్యా రాశి వారికి లాభ స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల అద్భుతంగా కలిసివస్తుంది. కొత్త మార్గాల్లో ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బాకీలు చేతికి అందుతాయి. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల ప్రతిభకు తగిన గుర్తింపు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు పాత పరిచయాల ద్వారా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

23
తులా రాశి

తులా రాశి వారికి కర్మ స్థానంలో ఈ రాజయోగం బలాన్ని చేకూరుస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఏర్పడి స్థానం మరింత పదిలమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, వేతన పెంపులకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలను మరింత విస్తరించాలని భావించే వారికి కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. పని ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత దక్కుతుంది.

33
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి భాగ్య స్థానంలో ఈ యోగం కలిసిరావడం వల్ల అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆగిపోయిన పనులన్నీ చకచకా ముందుకు సాగి పూర్తవుతాయి. ఉద్యోగులకు గౌరవప్రదమైన పదవులు, ఉన్నత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుని మంచి లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షలు, చదువుల్లో ఆశించిన విజయాలు దక్కుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories