Lucky Zodiac signs: వృశ్చికరాశిలో ఏర్పడనున్న మహాలక్ష్మీ రాజయోగం అదృష్టమంతా ఈ 3 రాశులదే

Published : Nov 17, 2025, 07:11 AM IST

Lucky Zodiac signs: త్వరలో వృశ్చికరాశిలో కుజుడు, చంద్రుడు కలయిక వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమవుతుంది. వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి. 

PREV
14
మహాలక్ష్మీ రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశిని, దారిని మార్చుకున్నప్పుడల్లా శుభయోగాలు ఏర్పడుతూనే ఉంంటాయి. ఆ యోగాల వల్ల రాశుల వారికి మేలు జరుగుతుంది. అలా ఇప్పుడు వృశ్చికరాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆ రాశిలో కుజుడు ఉన్నాడు. త్వరలోనే అదే రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. దీని వల్ల శుభకరమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల  మూడు రాశుల వారికి  జీవితంలో అనేక శుభ పరిణామాలు కలుగుతాయి.

24
వృశ్చిక రాశి

వృశ్చిక రాశిలోనే ఈ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాశిలోని మొదటి ఇంట్లో  ఈ యోగం ఏర్పడుతుండడం వల్ల ఎన్నో గొప్ప ప్రయోజనాలుంటాయి. ఆకస్మిక ధనలాభం రాసి పెట్టి ఉంటుంది. ఎన్నో రకాల పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.  వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు వస్తాయి. మొత్తమ్మీద ఈ రాశి వారికి అంతా కలిసి వస్తుంది. 

34
మేష రాశి

మేష రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం కలిసి వస్తుంది. దీని వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరికి  వారసత్వ ఆస్తి దక్కే అవకాశం ఉంది. దీని ద్వారా వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి.  వీరు విదేశీ ప్రయాణాలు చేసే వాటి వల్ల కూడా ఆర్థిక లాభాలు కలగవచ్చు. వీరికి వైవాహిక జీవితం,  కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.  ఇంట్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

44
మకర రాశి

మకర రాశి వారికి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ మద్దతు కూడా దక్కుతుంది. వీరికి అందరిలో గౌరవం పెరుగుతుంది. అప్పులు తీరుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories