డబ్బు సంపాదించాలని, దర్జాగా బతకాలని అందరూ అనుకుంటారు. కానీ కొందరే అందుకోసం కష్టపడతారు. కొన్నిసార్లు అదృష్టం కూడా వారి వెంట నడుస్తుంది. కష్టానికి అదృష్టం తోడైతే ఇంకేముంది అనుకున్నది ఈజీగా సాధిస్తారు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాకుండా ఎదుగుతారు. మరి అదృష్టం అందరినీ వరిస్తుందా అంటే చెప్పలేము. కానీ.. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి మాత్రం అదృష్టం నీడలా వెన్నంటే ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఆ తేదీల్లో పుట్టిన వారు సడెన్ గా ధనవంతులవుతారట. మరి మీరేమైనా ఆ తేదీల్లో పుట్టారో ఒకసారి చెక్ చేస్కోండి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, వృత్తి, భవిష్యత్తును పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మూల సంఖ్య 1 నుంచి 9 వరకు వివిధ సంఖ్యలను సూచిస్తుంది. ప్రతి మూల సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించి ఉంటుందని నమ్మకం. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారిని అదృష్టం వరిస్తుంది. ఆ తేదీలేంటో ఇక్కడ చూద్దాం.
25
ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు!
ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 4. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు అధిపతి రాహు గ్రహం. దీన్ని గూఢమైన, అసాధారణ శక్తులతో ముడిపడి ఉన్నట్లుగా పరిగణిస్తారు. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు.
35
కష్టపడే వ్యక్తిత్వం
4 మూల సంఖ్య కలిగిన వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలిగినవారు. విజయం సాధించడానికి శ్రమిస్తారు. వారు తమ పనిలో పూర్తిగా మునిగిపోతారు. అనుకున్న పని పూర్తి చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తారు. అదృష్టంతో పాటు కష్టం కూడా తోడుకావడం వల్ల వీరు అకస్మాత్తుగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందట.
45
ప్రత్యేకంగా ఆలోచిస్తారు
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఎలాంటి రిస్క్ చేయడానికైన వెనుకాడరు. ఫలితం గురించి ఆలోచించకుండానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారి తీక్షణమైన బుద్ధి, ప్రత్యేక ఆలోచనల కారణంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ కొత్త అవకాశాలను వెతకడంలో నిమగ్నమై ఉంటారు.
55
ఈ రంగాల్లో రాణిస్తారు!
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు మీడియా, రాజకీయాలు, న్యాయం వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. వారి వ్యూహాత్మక ఆలోచన, ప్రభావవంతమైన వ్యక్తిత్వం వారిని ఈ రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వీరు క్రమశిక్షణ, నిజాయితీ కలిగి ఉంటారు. దీనివల్ల వారికి సమాజంలో ఎక్కువ గౌరవం లభిస్తుంది.