Saturn Transit: ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలాన్ని తీసుకురాబోతున్న శని దేవుడు.. పెరగనున్న సంపాదన

Published : Jun 10, 2026, 11:53 AM IST

Saturn Transit: శని దేవుడు సరైన స్థానంలో ఉంటే శుభ ఫలితాలను అందిస్తాడు. ఇప్పుడు 4 రాశుల వారికి ఆ కాలం వచ్చింది. జూలై 2వ తేదీన శని రేవతి నక్షత్రంలోని రెండవ పాదంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 8 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల 4 రాశుల వారికి కలిసి వస్తుంది. 

PREV
14
మిథున రాశి

శని దేవుడు రేవతి నక్షత్రంలోని రెండవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. వీరు తమ తల్లితో మంచి సమయాన్ని గడుపుతారు. మనసు ఏకాగ్రతగా ఉంటుంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా వెంటాడుతున్న అనారోగ్యాలనుండి బయటపడే అవకాశం ఉంటుంది.

24
కర్కాటక రాశి

శని దేవుడి సంచారం కర్కాటక రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరికి అదృష్టం తోడుగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇన్నాళ్లు పడిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. మనసులోని ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఎప్పటినుంచో పెండింగ్లో పడిన పనులు పూర్తవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కే రోజులు ఇవే.

34
కన్యా రాశి

కన్యా రాశి వారికి శని గ్రహ సంచారం విజయాలను అందిస్తుంది. వారు చేసే ప్రతి పనిలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కష్టాలు పడే రోజులు ముగుస్తాయి. వేగంగా పురోగతి చెందుతారు. వీరి వ్యక్తిత్వం కూడా అందరికీ నచ్చుతుంది. సంతోషంగా కుటుంబాన్ని చూసుకుంటారు.

44
కుంభ రాశి

శని గ్రహం రేవతి నక్షత్రంలోని రెండవ స్థానంలోకి అడుగుపెట్టడం వల్ల కుంభరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మనసులోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతాయి. భూమి లేదా ఇల్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు కూడా చాలా వరకు తగ్గవచ్చు. పాత స్నేహితులను కలుసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories