ఈ అద్భుత దృశ్యం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఐరోపా( స్పెయిన్, పోర్చుగల్), ఉత్తర ఆఫ్రికా ( ఈజిప్ట్ , లిబియా), సౌదీ అరేబియా, యూఏఈలలో కనిపిస్తుంది.ఈ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టపగలే కొన్ని నిమిషాలు చీకటిని చూస్తారు. అయితే, భారత్ లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. అందుకే.. గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం కూడా ఉండదు.
సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది..?
భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసినప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అదే.. సూర్యునిలో కొంత భాగం మాత్రమే కప్పేసినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. 2027లో సంభవించేది అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్య గ్రహణం.
గ్రహణాన్ని చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
సూర్యగ్రహణాన్ని నేరుగా, కంటితో చూడటం ప్రమాదకరం. దీనివల్ల కళ్ళకు శాశ్వత నష్టం కలగవచ్చు. కాబట్టి, ఎల్లప్పుడూ సోలార్ ఫిల్టర్ లేదా ప్రత్యేక కళ్ళద్దాలను ఉపయోగించాలి.