Ugadi Rasi Phalalu 2024: క్రోధి నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

First Published | Apr 8, 2024, 1:07 PM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  కుంభరాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  కుంభరాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

Aquarius

  
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

ఆదాయం:-14
వ్యయం:-14

రాజపూజ్యం:-6
అవమానం:-1

గురుడు  చతుర్ధ  1-5-2024 వరకు తృతీయ స్థానంలో సంచారం స్థానంలో సంచరించి.తదుపరి సంవత్సరాంతం చతుర్ధ స్థానంలో లోహ మూర్తి గాశసంచారం

శని  ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్ర మూర్తి గా సంచారం

రాహువు ఈ సంవత్సరం అంతా ధన  స్థానంలో లోహ మూర్తి గా సంచారం

కేతువు ఈ సంవత్సరం అంతా అష్టమ ‌ స్థానంలో లోహ మూర్తి గాసంచారం.

(ఈ రాశి వారికి ఏలనాటి శని )

సువర్ణమూర్తి గా    రజత మూర్తి గా      లోహ మూర్తి గా   తామ్ర మూర్తి గా
1-5-24 వరకు.     సంవత్సరాంతం


మే నుండి చతుర్ధ స్థానంలో సంచారం అనుకూలమైనది కాదు.వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది.దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.గురు బలం అంతంతమాత్రం ఉండటం వల్ల ఒక ప్రణాళిక బద్ధంగా జీవన విధానం అలవాటు చేసుకోవాలి.సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించాలి.ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.విద్యార్థులు పట్టుదలతో చదవాలి.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులకు గురి అవుతారు.ఉద్యోగస్తులకు స్థానచలనం మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఆదాయం మరియు ఖర్చు సమానంగా ఉంటాయి.బంధుమిత్రులతో  కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండాలి.

శని జన్మ రాశిలో సంచారం వలన సామాన్యంగా ఉంటుంది.ఇష్టం లేని కష్టతరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది.ప్రయాణాల్లో అవరోధాలు ఇబ్బందులు ఎదురవుతాయి.మానసిక ఆందోళన పెరుగుతుంది.అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యాపారాలలో ఒక్కసారిగా ధన లాభం మరోసారి ధన నష్టం జరుగుతూ ఉంటుంది.
 

Aquarius Horoscope

రాహు కేతు గ్రహాల సంచారం అనుకూలమైనది కాదు.ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.సమాజంలో అపకీర్తి.మానసికంగా శారీరకంగా నిరుత్సాహంగా ఉండటం.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు.ప్రభుత్వ అధికారులు వలన ఇబ్బందులు కలుగుతాయి.మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే ఓర్పు సహనం గా ఉన్నట్లయితే ఆశించిన ప్రయోజనం పొందగలరు.చేయవలసిన పనులు పట్టుదలతో ఒక నిర్ణయానికి వచ్చి దృఢంగా చేసినట్లయితే విజయం లభిస్తుంది.అనవసరమైన వ్యక్తులు తో సంభాషణ చర్చలు సమావేశాలకు దూరంగా ఉండాలి.ఉన్నతాధికారులతో ఓర్పు సహనం గా ఉండాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి.

Aquarius

ధనిష్ట నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.

శని 3-10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  క్షేమ తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం

శతభిషం నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి పరమ మిత్ర తార లో లో సంచారం.

శని 3-10-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి జన్మతారలో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సంపత్తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  విపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం నైధనతార లో సంచారం

పూ.భాద్ర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.

రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సంపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం

(ఈ సంవత్సరం రాశి వారికి గోచార ఫలం సామాన్యంగా ఉన్నది. జన్మశని మరియు అష్టమ కేతువు వలన ఇబ్బందులు కలుగుతాయి. నిత్యం దైవారాధన చేయడం మరియు సుందరకాండ పారాయణం దుర్గారాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందగలరు.)

Aquarius


ఏప్రియల్
ఇంటా బయటా సామాన్యంగా ఉంటుంది.ఆదాయం పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది.సహోద్యోగులతో మరియు సాటివారితో లౌక్యంగా వ్యవహరించాలి. వాహన యంత్రాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి.క్రయ విక్రయాలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ప్రయాణాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉండును. శుభ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉన్నది.

మే
ఈనెల గ్రహ సంచారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏర్పరచుకుంటారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు చిన్నపాటి నష్టాలు కలిగే సూచనలు. ఆందోళనను తగ్గించుకోవాలి.బంధు వర్గం వారు వ్యతిరేకులుగా ప్రవర్తిస్తారు.
 


జూన్
తలపెట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగాలలో మరియు వ్యాపారం నందు మీ యొక్క సమర్ధతను చూపించుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.చేసే పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురగును.మిత్రులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.రకరకాల ఆలోచనలతో మానసికంగా సతమతమవుతారు.సరైన సమయానికి ధనం చేతికి లభించదు.

జూలై
ఇంటా బయటా సహనం తో ఉండటం మంచిది. క్రయవిక్రయాలలో అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు పడతారు.చిన్న పనైనా పెద్ద జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఎదురవుతాయి. ఊహించిన దానికన్నా అధిక మొత్తంలో ఖర్చు ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అనేక రకాల ఒత్తిడి ఉంటుంది.ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆగస్టు
ఇంటా బయటా తెలివిగా వ్యవహరించాలి.రోజు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి ఆలస్యంగా పూర్తగును.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణాలు చేయవలసి వస్తుంది. సాధ్యమైనంతవరకు ప్రయాణాలు తగ్గించడం మంచిది.అత్యవసరమైన విషయాలకు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మాసాంతంలో బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.చేయు కార్యక్రమాలు లో పట్టుదలను నిలుపుకోవాలి. స్త్రీ మూలకంగా కలిసి వస్తుంది.గృహంలో  శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

సెప్టెంబర్
అనవసరపు ఆందోళనకు గురి అవుతారు.అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం ఉంటుంది.రావలసిన బాకీలు వసూలు అవ్వవు. ఇతర ఉద్యోగస్తులతో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి.మనస్సు పూర్తిగా ఒత్తిడితో నిండి ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి.మీ కర్తవ్యాన్ని అంకితభావం ఓర్పుతో వ్యవహరిస్తారు. ఇతరుల హామీల గురించి ఎదురుచూసి భంగ పడవలసి ఉంటుంది.భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు రాగలవు.


అక్టోబర్
ఈ నెల ప్రారంభంలో మానసికంగా కొద్దిగా ఒత్తిడికి లోనవుతారు. అనుకోని కొన్ని విషయాల్లో చిక్కు కోవాల్సి వస్తుంది.ఖర్చు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో మానసికంగా ఆందోళనకు గురవుతారు.మాసం చివరలో ఉత్సాహంగా వ్యవహరించ గలుగుతారు. అన్ని విషయముల యందు మీ మాట చెల్లుబాటవుతుంది. మిమ్మల్ని విమర్శించిన వారు నిశ్శబ్దముగా మీ ముందు నిలుస్తారు.నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

నవంబర్
మానసికమైన ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉన్నది.సంతానం విషయంలో కీడు జరిగే అవకాశం. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు బాకీలను చెల్లింపు చేసుకోగలుగుతారు. గత తప్పిదాలను గురించి నెరిగి సరి చేసుకోగలుగుతారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను చదువు యందు నిర్దేశించు కుంటారు. దైవ సంబంధిత కార్యాలలో ఆసక్తి చూపుతారు.స్త్రీల పరంగా లాభం చేకూరుతుంది.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
 

డిసెంబర్
అధికమైన శ్రమతో ధనాన్ని ఆర్జిస్తారు.ఆదాయ మార్గాలు బాగా వృద్ధి చెందుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణము ఇచ్చి ప్రోత్సహించేవారు ఉంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అన్ని విషయాల్లోనూ అధికారులు పెద్దవారు వంటి వారి సలహాలు ఎల్లప్పుడూ ఉంటాయి.ఆదాయమును కు తగినట్టుగా ఖర్చు ను సమర్థించుకుంటారు.భాగస్వామి వ్యాపారం చేసే వారికి రాణింపు ఉంటుంది.అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.

జనవరి
చాలా కాలంగా పరిష్కారం కానీ ముఖ్యమైన సమస్యలను పరిష్కరించు కోగలుగుతారు.చేయు వృత్తి వ్యాపారాలలో రాబడి బాగుంటుంది.నూతన గృహ నిర్మాణాధి విషయాలు కలిసి వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అంత ఆశాజనకంగా ఉండవు.ఆరోగ్యం విషయంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి.మాసాంతంలో ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది.వ్యవహారాల విషయంలో లౌక్యం అవసరం. శత్రువుల విషయంలో ముందుచూపు అవసరం.


ఫిబ్రవరి
వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పెద్దల యొక్క ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతికూలంగా ఉండే విషయాలు ను అనుకూలంగా మార్చుకుంటారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన పరిచయాలు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ వ్యక్తులు కు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన వస్తువులు సేకరిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మార్చి
ఈనెల అన్ని వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చును.సొంత విషయంలో ఆసక్తి చూపుతారు. అనవసరపు చర్చలు కు దూరంగా ఉండటం మంచిది.బాధ్యతలు నిర్వహించడం లో అంకితభావంతో మెలగవలెను. సంతానం విషయంలో వ్యతిరేక ధోరణి పనికిరాదు.పూర్తి కావాల్సిన పనులు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు మాత్రం ఈ మాసం ప్రయోజనకరంగా ఉంటుంది.ఇతరుల యొక్క సమస్యలు తొలగుటకు మీ వంతు కృషి చేస్తారు.

Latest Videos

click me!