Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మకర రాశి ఫలితాలు

First Published | Apr 8, 2024, 10:09 AM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  మకరరాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  మకర రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

capricorn

మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఆదాయం:-14
వ్యయం:-14

రాజపూజ్యం:-3
అవమానం:-1

Capricorn

ఈ రాశి వారికి గురుడు 1-5-24 వరకు చతుర్ధ స్థానంలో రజత మూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం పంచమంలో  సువర్ణమూర్తి గా సంచారం.    

శని ఈ సంవత్సరమంతా ధన స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.(శని సంచారం అనుకూలం కాదు)

రాహు ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో రజత మూర్తి గాసంచారం (శుభ ఫలితాలు పొందగలరు)

కేతువు ఈ సంవత్సరం అంతా భాగ్య ‌స్థానంలో రజత మూర్తి గా సంచారం.

(ఈ రాశి వారికి ఏలినాటి శని )


గురు సంచారం అనుకూలం. సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి.వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందగలరు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.కుటుంబంలో వివాహ శుభ కార్యాలు జరుగును.విదేశీ ప్రయత్నాలు ఫలించును.కుటుంబ విషయాలు సానుకూలంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది.నూతనమైన అభివృద్ధి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు.ఎంతటి కష్టమైనా పని అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు.పలు మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. దుష్కార్య లకు దురాలోచనలు కు దూరంగా ఉండాలి. ప్రయాణాలు లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.కోర్టు విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి.శారీరకంగా మానసికంగా బలపడతారు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.మీ మాటకు విలువ పెరుగుతుంది.భూ గృహ కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం.స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరపు బంధు వర్గము తో అపకారం జరిగే అవకాశం.విద్యార్థులు విద్య యందు శ్రద్ధ చూపించాలి.ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఉత్సాహంగా ఉంటుంది.ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి.వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికంగా ఉన్న దానికి తగ్గట్టుగా ప్రతిఫలం లభిస్తుంది.భూ గృహ వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


Capricorn

ఉ.షాఢ నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి  విపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం సాధన తార లో చారం

కేతువు 11-11-24 వరకు సంపత్తార లో సంచారం.తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం

శ్రవణా నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు జన్మ తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి సంపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు క్షేమ తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు క్షేమ తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  ప్రత్యక్తార లో చారం

కేతువు 11-11-24 వరకు జన్మతారలో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం పరమ మిత్ర తార లో సంచారం

ధనిష్ట నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.

శని 3-10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  క్షేమ తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం

(ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు రాహు సంచారం అనుకూలం. శని కేతు సంచారం అనుకూలంగా లేదు కావున ఆంజనేయ మరియు గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందగలరు.)


ఏప్రియల్
అనవసర ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల వర్గంతో కారణంగా విరోధాలు రాగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం అయ్యే అవకాశం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరకు కార్య సాఫల్యత చేకూరుతుంది. వ్యవహారాల్లో మనోధైర్యం తో వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో హుందాతనం వ్యవహరించ లేరు. గతంలో చేసిన కొన్ని పొరపాట్లు కు మనోవేదనకు గురి అవుతారు. విద్యార్థులకు మధ్యస్తంగా ఉంటుంది.


మే
అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు.మితిమీరిన అనేక ఆలోచనలు వలన శిరో భారం పెరుగుతుంది. వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు.స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు.నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు పెరుగుతాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శత్రువుల పై ఆధిక్యత సాధిస్తారు.వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.సమాజంలో నిందలు లేదా అపవాదులు ఎదుర్కోవలసి ఉంటుంది.కొన్ని తప్పని ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

య నమః అనే పదకొండు సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

జూన్
సోదరి వర్గంతో చిన్నపాటి మాట పట్టింపులు రాగలవు.ఇష్టమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శత్రువులపై విజయం కలుగుతుంది.స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.చెడు వ్యక్తులు మీతో స్నేహం చేయుటకు ముందుకు వస్తారు.చెడు సావాసమునకు దూరంగా ఉండవలెను.దైవ క్షేత్రాలు ను సందర్సన చేస్తారు. సంతానం సౌఖ్యం కలుగుతుంది.గృహ వాహన మార్పులు చేస్తారు. వ్యాపార ప్రయత్నాలు చురుకుగా ముందుకు వెళతాయి.

జూలై
మాసారంభం శుభాశుభాలు మిశ్రమ ఫలితాలు గా ఉండును.చేసే ప్రయాణాలు కలిసి రావు. వ్యాపార విషయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సుఖమైన జీవితానికి చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. మంచి చేయదలచినప్పటికీ సమాజంలో మీకు చెడు ఎదురవుతుంది. సరదా తనము కొరకు ఆదాయాన్ని ఖర్చు చేయడం తగ్గించుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది.మధ్యవర్తిత్వం చేయుట మంచిది కాదు.వ్యాపారస్తులకు వ్యాపారం కొంత నిరాశాజనకంగా జరుగును.

ఆగస్టు
మాస ప్రారంభం వృత్తి వ్యాపారస్తులకు అంత స్వాగతించిన దిగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో అసమానతలకు లోనుగుదురు. ఉద్యోగస్తులు పై అధికారులకు సమాధాన పరచు కోవాల్సి వస్తుంది. కుటుంబంలో వ్యక్తులు ఎవరి దారి వారిది అన్నట్టుగా వ్యవహరించుకొనెదురు. మీ భావాలను వ్యక్తపరచడం లో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు లో చురుగ్గా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాసాంతమున అన్ని రంగాల వారికి కొంత ఉత్సాహంగా  ఉంటుంది.

సెప్టెంబర్
ఈ నెల అంతా గ్రహ సంచారం బాగుంటుంది.సంతోషకరమైన వార్త వింటారు.శారీరక సౌఖ్యం ఉంటుంది. శత్రువర్గం పై విజయం సాధిస్తారు.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ధాన్యాది వస్తు వాహన కొనుగోలు చేస్తారు.మానసికంగా ఉన్న ఆలోచనలు కార్యాచరణలో సిద్ధిస్తాయి.సంతానం అభివృద్ధి చెందుటకు చేపట్టిన కార్యక్రమాలు విజయాన్ని ఇస్తాయి.సోదరి వర్గం తో సఖ్యత  పెరుగుతుంది.గతంలో చేసిన రుణాలు నుండి కొంత బయటపడతారు.వృత్తి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు.


అక్టోబర్
ఇతరులపై ద్వేషాన్ని పెంచుకొనుట మంచిది కాదు. భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌఖ్యం కలుగుతుంది.బంధుమిత్రుల సమాగమం ఉంటుంది.భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి.ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు.ఖర్చులకు సరిపడా ఆదాయం ఉండును.వ్యవహారాలు చేసేటప్పుడు సంయమనం పాటించవలెను. ప్రభుత్వపరమైన వ్యవహారాలు లబ్ధిని చేకూరుస్తాయి.

capricorn

నవంబర్
శత్రువులు వృద్ధి చెందుతారు.ఇంటా బయట సమాజంలో మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మంచి చేసినప్పటికీ ఎదురు చెడు ఫలితాలు దక్కును.గ్రహ సంచారము బాగు ఉన్నందు వలన చేయు వృత్తి ఉద్యోగాల విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.ముఖ్యమైన విషయాల యందు క్రియాశీలకంగా వ్యవహరించుకోవాలి.బాధ్యతాయుతంగా మెలగవలసిన ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.

Capricorn


డిసెంబర్
ఈనెల గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు ఇచ్చును.శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులను ధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది.తక్కువ దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది.వృత్తి ఉద్యోగాల్లో అంకిత భావముతో ఉండవలెను. ఇతరుల యొక్క సహాయ సహకారములు ఆశించకుండా ఉండుటయే మంచిది.మీ తప్పు లేకపోయినా ఎదుటివారు నిందించుట కు అవకాశం ఉన్నది.మనసుకు విచారము కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 

జనవరి
కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురువగలవు.అకారణంగా నిందలు మోయాల్సి వస్తుంది. వివాహాది శుభ ప్రయత్నాలు ఫలించవు. క్రయవిక్రయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆచితూచి ముందడుగు వేయవలసి ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత విషయాలు లో అనుమతులు వచ్చు ఆలస్య మగును. విద్యార్థులుకు సమయం అనుకూలమైనది. కష్టపడి చదివితే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత అవకాశాలు ఉన్నాయి.ఈ నెల అంతా గ్రహ సంచారం అంత కలిసి రాదు.ఇంటా బయటా సామాన్యంగా ఉంటుంది.

Capricorn

ఫిబ్రవరి
శుభవార్తలు వింటారు.మంచి వారితో సత్సంగం ఏర్పడుతుంది. ఇష్టమైన పదార్థాలు  లభిస్తాయి.అన్ని విషయాల్లోనూ  కుటుంబ వ్యక్తుల సహాయసహకారాలు అందుకుంటారు.తలపెట్టిన కార్యాలు కుటుంబ వ్యక్తుల సమిష్టి కృషి చే సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మాసం చివరలో ఉద్యోగస్తులు అధికారులు యొక్క మెప్పు పొందుతారు. సమాజంలో మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు.

మార్చి
ఉద్యోగస్తులకు స్థాన చలనం అయ్యే సూచనలు ఉన్నాయి.దగ్గర బంధువుల నుండి చెడు వార్త వినవలసి వస్తుంది.ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులచే ఉద్యోగస్తులు మాట పడవలసి ఉంటుంది.ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ చూపవలెను.కుటుంబ విషయాలు ఒక్కరే అయి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పరిచయాలు వలన లాభం చేకూరుతుంది. ఆర్థికంగా బాగుండును. ధైర్యముతో  ఏ పనైనా చేయవలెను.ఏ విషయంలోనైనా మీదే పై చేయి గా ఉంటారు.
 

Latest Videos

click me!