ఈ సోమావతి అమావాస్య రోజున మీరు పేదలకు దుస్తులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందట. అదేవిధంగా.. మీ ఇంట్లో పెద్దలకు అంటే పితృదేవతలకు కూడా దుస్తులు సమర్పించవచ్చు. అలా చేయడం వల్ల... పితృదేవతల ఆశీస్సులు అందుతాయి.
అమావాస్య రోజున వెండి వస్తువులను దానం చేయండి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, పూర్వీకుల స్థానం చంద్రుని పై భాగాలలో ఉందని, అందుకే పూర్వీకులకు వెండితో చేసిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం , శ్రేయస్సును తీసుకురాగలదు.