Ketu Moon Conjunction: కేతు, చంద్రుల కలయికతో గ్రహణ యోగం.. ఈ 5 రాశులవారికి చుక్కలే!

Published : Aug 05, 2026, 03:05 PM IST

Ketu Moon Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 12న సింహరాశిలో కేతు, చంద్రుల కలయిక జరగనుంది. దీనివల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనుంది. మరి ఆ రాశులేవో, వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

PREV
15
మీన రాశి- అనవసర వాగ్వాదాలు

కేతువు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గ్రహణ యోగం వల్ల మీన రాశివారికి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనవసర వాగ్వాదాలు జరగవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కొత్త నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి, శారీరక అలసట పెరగవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకుని, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

25
వృశ్చిక రాశి- ఓపిక అవసరం

వృశ్చిక రాశివారికి ఈ యోగం కాస్త సవాలుగా ఉంటుంది. ప్రత్యర్థులు లేదా శత్రువుల వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా, ఓపికతో పరిష్కరించుకోవాలి.

35
మకర రాశి- తొందరపాటు వద్దు

మకర రాశివారి ఓపికను ఈ సమయం పరీక్షిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలకు ఆలస్యంగా ఫలితాలు రావచ్చు. సన్నిహితుల నుంచి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఎక్కువ ప్రయత్నిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. పెట్టుబడులు, డబ్బు వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.

45
కన్య రాశి- జాగ్రత్త అవసరం

కన్య రాశి వారు ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడులు, అప్పులు లేదా పెద్ద ఖర్చుల గురించి బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనుల్లో అనుకోని ఆలస్యం జరగవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి రావచ్చు. అనవసర ప్రయాణాలు, ఖర్చులు తగ్గిస్తే మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు.

55
సింహ రాశి- మాటల్లో జాగ్రత్త అవసరం

గ్రహణ యోగం సింహరాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి, ఈ రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు సమస్యలను సృష్టిస్తాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు అదుపులో లేకపోతే సంబంధాల్లో విభేదాలు రావచ్చు. కొత్త పెట్టుబడులను కొన్ని రోజుల పాటు వాయిదా వేయడంతో పాటు పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories