ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగాలలో కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
313
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
513
కర్కాటక రాశి ఫలాలు
రావాల్సిన డబ్బు సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
613
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
713
కన్య రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.
813
తుల రాశి ఫలాలు
కొత్త వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు. వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి.
1013
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. నిరుద్యోగులు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు.
1113
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వల్ల కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది.
1213
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.
1313
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.