గురు గ్రహం తులా రాశి వారికి పదవ ఇంట్లోకి అడుగుపెడతారు. ఇది వారి జీవన స్థానం. దీనివల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆకస్మిక మలుపులు, లేదా ఇబ్బందులు రావచ్చు. పనిభారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, టెన్షన్ పెరుగుతాయి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలు మీ ఉద్యోగానికే ముప్పు తెచ్చిపెట్టొచ్చు. తొందరపడి ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయడం లేదా కొత్త వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.
పరిహారం: గురువారాల్లో శివాలయానికి వెళ్లి నవగ్రహ పూజ చేయడంతో పాటు, వృద్ధులకు లేదా నిరాశ్రయులకు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.