Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!

Published : May 24, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.05.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఆస్తి వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.

413
మిథున రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

813
తుల రాశి ఫలాలు

వాహన వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

1213
కుంభ రాశి ఫలాలు

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థికంగా అనుకూలం. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

1313
మీన రాశి ఫలాలు

వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

Read more Photos on
click me!

Recommended Stories