GajaLakshmi Yoga: జోతిష్య శాస్త్రంలో గజ లక్ష్మీ యోగం అత్యంత శుభప్రదమైన యోగం. గురు, శుక్ర గ్రహాల కలయికతో ఇది ఏర్పడుతోంది. మే నెలలో ఏర్పడనున్న ఈ యోగం.. కొన్ని రాశుల వారి జీవితంలో సిరి, సంపదలు మోసుకురానుంది.
జోతిష్య శాస్త్రంలో గజలక్ష్మీ యోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం ఏర్పడిన ప్రతిసారీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. అదృష్టాన్ని పెంచుతుంది. గురు, శుక్ర గ్రహాలు ఒకేసారి కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మొదటి దశ మే 14 నుంచి జూన్ 1 వరకు ఉంటుంది. రెండో దశ జూన్ 8 నుంచి జులై 4 వరకు కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం మే 14 నుంచే స్పష్టంగా కనపడటం మొదలుపెడుతుంది. మరి… ఈ శుభ యోగం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యే రాశులు ఏంటో ఓసారి చూద్దాం….
25
మిథున రాశి..
గజలక్ష్మీ యోగం మిథున రాశివారి జీవితాన్ని ఆనందమయం చేయనుంది. గురు, శుక్ర గ్రహాలు రెండూ కలిసి ఈ రాశివారి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తాయి. అనుకోకుండా సంపద పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది.
35
కర్కాటక రాశి..
ఈ గజలక్ష్మీ యోగం కర్కాాటక రాశివారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. కెరీర్ లో సానుకూల మార్పులు వస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు.
ఈ యోగం తులా రాశి వారి కర్మ భావంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వృత్తి రంగంలో మంచి మార్పులు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం లేదా మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి బదిలీల వల్ల ప్రయోజనం కలగవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ లేదా పరిపాలన రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
55
మీన రాశి
ఈ యోగం మీన రాశి వారికి మానసిక, మేధోపరమైన ఎదుగుదలను తీసుకురాగలదు. విద్యార్థులు తమ చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. వారి పనితీరు మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత, సామరస్యం నెలకొంటాయి. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్లు కూడా సాధ్యమే. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి.