కర్కాటక రాశి వారిపై గురు వక్రగమన ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. గురు కర్కాటక రాశిలోనే వెనక్కి కదలడం ప్రారంభించడం వల్ల ఆధ్యాత్మిక, వ్యక్తిగత, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొంత గంధరగోళంగా, ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ కలిగినా.. ఈ కాలం ఆత్మవిశ్లేషణకు అత్యుత్తమ సమయం. ఏ దిశలో వెళ్లాలో, ఎవరిని నమ్మాలో ఆలోచించాల్సిన సమయం.
వ్యక్తిగత సంబంధాలు.. ముఖ్యంగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావచ్చు. అపార్థాలు దూరం చేయడానికి సహనం చాలా అవసరం. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు, నీరసం, మానసిక ఒత్తిడి వంటివి కనిపిస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.