తుల రాశి..
తుల రాశి వారికి శని యోగకారుకుడు కావడం వల్ల ఈ నక్షత్ర మార్పు వీరికి రక్షణ కవచంలా పని చేస్తుంది. అందుకే, ఈ సమయం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ సమయంలో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో శని ప్రత్యేకత:
ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి శని దేవుడే. తన సొంత నక్షత్రంలో శని సంచరించినప్పుడు ఆయన మరింత శక్తివంతంగా మారుతాడు. ఈ సమయంలో క్రమశిక్షణ, నిజాయితీ , కష్టపడే తత్వం ఉన్నవారికి శని దేవుడు అడగకముందే వరాలను ప్రసాదిస్తాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
శని ప్రభావం సానుకూలంగా ఉన్నప్పటికీ, అందరూ ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం మంచిది:
శనివారం రోజు శని చాలీసా పఠించడం,పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం,నల్ల నువ్వులతో శని దేవునికి తైలాభిషేకం చేయడం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.