మేష రాశి వారికి గురు గ్రహం 5వ ఇంట్లో సంచరించనున్నాడు. ఈ స్థానం విద్య, సృజనాత్మకత, సంతాన భాగ్యానికి ప్రతీక. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గురుడి కృపతో అద్భుత విజయాలు సాధిస్తారు. కళలు, రచన, సాహిత్యం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారిని కొత్త, పెద్ద అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో ఒకరికొకరు ప్రేమ, ఆప్యాయతలు పంచుకుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.